విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు (Mohan Babu) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి(63) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నివాళులు అర్పిస్తున్నారు. తిరుపతిలో ఉండే ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు(63) గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో మోహన్‌బాబు కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కాగా, రంగస్వామి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. రంగస్వామి అంత్యక్రియలు గురువారం ఉదయం నిర్వహించనున్నారు. రంగస్వామి తిరుపతిలో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. మోహన్‌బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు.
రంగస్వామి అన్నయ్య మంచు మోహన్‌బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, ఎడ్యూకేషనలిస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. రంగస్వామి తిరుపతిలో నివసిస్తున్నారు. ఆయన రైతుగా పనిచేస్తున్నారు. అదే సమయంలో చాలా ఏళ్లుగా మోహన్‌బాబు,అతని ఫ్యామిలీ నిర్వహిస్తున్న దాతృత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. గ్రౌండ్ లెవల్లో అన్ని పనులను చూసుకుంటున్నారట. ఆయనకు భార్య కాంతమ్మ ఉన్నారు. రంగస్వామి నాయుడు మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, రైతులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. రేపు(గురువారం) తిరుపతిలో రంగస్వామి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
మోహన్ బాబు సోదరుడు రంగస్వామి నాయుడు
మంచు మోహన్‌బాబు తనయుడు, హీరో మంచు విష్ణు ఇటీవల `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే. హోరా హోరిగా సాగిన ఈ ఎన్నికల్లో మోహన్‌బాబు కీలక పాత్ర పోషించారు. ఇక ఐదు వందలకుపైగా చిత్రాల్లో నటించి తెలుగులో చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా ఎదిగారు మోహన్‌బాబు. ఆయన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా రాణిస్తున్నారు. కూతురు మంచు లక్ష్మీ నటిగా, హోస్ట్ గా, నిర్మాతగా రాణిస్తుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.