ఊరట నిచ్చిన హైకోర్టు... ఊపిరి పీల్చుకున్న ప్రభాస్‌..

ఎట్టకేలకు ప్రభాస్ పోరాటం ఫలించింది. గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న ప్రభాస్ గెస్ట్ హౌస్ లాండ్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 24, 2019, 12:51 PM IST
ఊరట నిచ్చిన హైకోర్టు... ఊపిరి పీల్చుకున్న ప్రభాస్‌..
ప్రభాస్,తెలంగాణ హైకోర్టు
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 24, 2019, 12:51 PM IST
ఎట్టకేలకు ప్రభాస్ పోరాటం ఫలించింది. గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న ప్రభాస్ గెస్ట్ హౌస్ లాండ్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్  రంగారెడ్డి జిల్లాలోని రాయదుర్గంలోని 2080 గజాల స్థలంలో ఉన్న ప్రభాస్ గెస్ట్ హౌస్‌ను తెలంగాణ రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయమై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి మంగళావారం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ భూముల నుంచి ప్రభాస్‌ను ఖాళీ చేయించడం చట్ట విరుద్దమని తన తీర్పులో పేర్కొంది. అంతేకాదు ప్రభాస్ పెట్టుకున్న రెగ్యులరైజేషన్ దరఖాస్తుపై 8 వారాల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఒక వేళ ప్రభుత్వం ప్రభాస్ పెట్టుకున్న దరఖాస్తును రిజెక్ట్ చేస్తే.. ప్రభాస్ మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది.

big relief to bahubali fame prabhas ..telangana high court ordered to telangana government to approval of prabhas guest house land ,prabhas,high court,prabhas house,prabhas guest house,prabhas guest house case,prabhas guest house case high court,prabhas latest news,hero prabhas,prabhas land case,prabhas guest house seized,prabhas case,prabhas house seized,prabhas land issue,actor prabhas,actor prabhas land case,high court reserves,prabhas house high court,prabhas saaho,prabhas movies,prabhas files petition in high court,high court prabhas,prabhas approaches high court on government notice,prabhas instgram,prabhas facebook,prabhas twitter,jabardast,,tollywood,telugu cinema,ఫ్రభాస్,ప్రభాస్ గెస్ట్‌హౌస్,ప్రభాస్ గెస్ట్‌హౌస్ హైకోర్టు,ప్రభాస్ గెస్ట్‌హౌస్ పై హైకోర్టు తీర్పు,హైకోర్టు తీర్పు,తెలంగాణ ప్రభుత్వం,ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్,ప్రభాస్ ఫేస్‌బుక్,ప్రభాస్ సాహో అప్‌డేట్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా.,
ప్రభాస్


ఈ భూములు చాల ఏళ్ల నుంచి ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి.  కానీ ప్రభుత్వం కాగితాలు చూసి అవి తమ అధీనంలో ఉన్నాయని చెప్పడం సరికాదని హైకోర్టు తీర్పులో పేర్కొంది. ఆక్రమణధారులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయిని, వారిని ఖాళీ చేయించడానికి భూ ఆక్రమణ నిరోధక చట్టాలు ఉన్నాయని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. 1958 నుంచి ఈ భూమిపై వివాదం నడుస్తోందని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అంతేకాదు ప్రభాస్ పెట్టుకున్న క్రమబద్దీకరణ్ కోసం పెట్టుకున్న దరఖాస్తు పరిష్కరిస్తే..ఇలాంటి భూ వివాదం ఉన్న మరికొందరు కూడా క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తుందని, అదే సమయంలో వివాదాలు పరిష్కారమవుతాయని ప్రభుత్వానికి కోర్టు సలహా ఇచ్చింది.

First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...