Home /News /movies /

BIG FIGHT IN JABARDASTH COMEDY SHOW AND APPA RAO SCOLD BULLET BHASKAR PK

జబర్దస్త్‌లో పెద్ద గొడవ.. అప్పారావును కొట్టిన బుల్లెట్ భాస్కర్..

జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)

జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)

Jabardasth Comedy Show: ఓ స్కిట్‌లో భాగంగా బుల్లెట్ భాస్కర్, అప్పారావు మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలోనే భాస్కర్‌ను బండ బూతులు తిట్టాడు అప్పారావు. విషయం ఏంటంటే..

కొన్నిసార్లు కామెడీ కూడా సీరియస్ అవుతుంటుంది. ఇఫ్పుడు కూడా ఇదే జరిగింది. ఎప్పుడూ నవ్వులు పంచే జబర్దస్త్ కామెడీ షో ఇప్పుడు సీరియస్ అయింది. అందులో ఓ స్కిట్‌లో భాగంగా బుల్లెట్ భాస్కర్, అప్పారావు మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలోనే భాస్కర్‌ను బండ బూతులు తిట్టాడు అప్పారావు. విషయం ఏంటంటే.. స్కిట్‌లో భాగంగా అప్పారావును భాస్కర్ కొట్టాలి.. ఆ స్కిట్‌లో అంతా కొట్టుకుంటూనే ఉంటారు. అలాగే మిగిలిన వాళ్లతో పాటు అప్పారావును కూడా కొట్టాడు భాస్కర్. దాంతో ఆయన ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు.

జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)
జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)


దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది. స్కిట్ అయితే ఇలా కొడతారా అంటూ భాస్కర్‌ను తిట్టేసాడు అప్పారావు. షర్ట్ విప్పేసి తనకు పడిన వాతలను చూపించాడు. ఇలా ఎవరైనా కొడతారా.. స్కిట్ పేరు చెప్పి గొడ్డును బాదినట్లు బాదావ్ అంటూ భాస్కర్‌పై మండి పడ్డాడు అప్పారావు. నేను కూడా టీం లీడర్ అనే సంగతి మరిచిపోయావా.. నీ య.. అంటూ బండ బూతులు తిట్టాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఇదంతా స్కిట్‌లో భాగంగా చేసారా లేదంటే నిజంగానే అయిందా అనేది ఆసక్తికరంగా మారింది.

గతంలో కూడా అప్పారావు ఇలాగే చేసాడు ఓసారి. అప్పట్లో షకలక శంకర్ టీంలో ఉన్నపుడు కూడా ఇలాగే కొడితే.. సీరియస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత అది స్కిట్‌లో భాగమే అని చెప్పారు. ఇప్పుడు కూడా ఇదే అంటున్నారు నెటిజన్లు. కానీ స్టేజీపై అప్పారావు తిట్టిన తీరు చూస్తుంటే మాత్రం మ్యాటర్ సీరియస్ అని అర్థమవుతుంది. ఇదంతా జరుగుతుంటే యాంకర్ రష్మితో పాటు జడ్జిలు కూడా అలాగే చూస్తుండిపోయారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth apparao, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు