వెండితెర యాంగ్రీ యంగ్ మెన్. దేశమంతా అభిమానించే ఎవర్ గ్రీన్ స్టార్. బాలీవుడ్ షెహెన్ షా. ‘లాక్ కర్ దే’ అంటూ బుల్లితెరపై కోటీశ్వరులను తయారుచేసే పని మొదలుపెట్టాడు. అక్కడా సక్సెస్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఇపుడు తెలుగులో సైరా..నరసింహారెడ్డి మూవీతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించబోతున్నాడు. ఆయనే పద్మవిభూషణ్..అమితాబ్ బచ్చన్. నేటితో నటుడిగా అమితాబ్ బచ్చన్ 50 వసంతాలను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా న్యూస్ 18 స్పెషల్ స్టోరీ.
అమితాబ్ బచ్చన్.. పేరెత్తకుండా ఇండియన్ సినిమా గురించి చెప్పడం సాధ్యం కాదు. బాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన... లెక్కలేనన్ని సినిమాలు అమితాబ్ లిస్ట్‌లో ఉన్నాయి. అమితాబచ్చన్‌తో భారతీయుల అనుబంధం ఈనాటిదికాదు. 1969 ఫిబ్రవరి 15నే రిలీజైంది. అప్పటి నుంచి మొదలైన నట ప్రస్థానం ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.

50 ఇయర్స్ ఇండస్ట్రీ అమితాబ్ బచ్చన్
ఐదు దశాబ్దాల తిరుగులేని సినిమా ప్రస్థానంలో వందలకొద్దీ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అందులో ఎన్నో బాక్సాఫీసు విజయాలను అందుకున్నారు. తన నట ప్రస్థానంలో నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు. దాంతో పాటు మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు.. ఇలా చెప్పుకొంటూపోతే అమితాబ్ బచ్చన్ జీవితం మహా గ్రంథం. అందులో ప్రతి పేజీ విలువైందే.

అమితాబ్ బచ్చన్ (ఇన్స్టాగ్రామ్ ఫోటోస్)
సామాజిక అనుసంధాన వేదికల్లో నేటితరం కథానాయకులెవరూ అమితాబ్‌కు సాటిరారు. అంతలా మిలియన్ల కొద్దీ అభిమానులున్నారు బిగ్‌బీకు. నిత్యం తన అభిమానులతో ఎన్నో విషయాలు పంచుకొంటూ వయసు శరీరానికే కానీ మనసుకుకాదని నిరూపిస్తున్నారు. భారతీయ చిత్రసీమలో తిరుగులేని నటుడిగా వెలుగొందుతున్న అమితాబ్ మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని కోరకుందాం..
ఇవి కూడా చదవండి
‘యాత్ర’ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాల్లో ఆ గుర్తులు ఎందుకు చెరిపేసారు..
రవితేజ, బాలయ్య బాటలోనే అక్కినేని కోడలు.. ఇంతకీ ఏ విషయంలోనే తెలుసా..
మహేష్ మరోసారి ఆ నిర్మాతకే ఓకే చెప్పాడా...