రమ్యకృష్ణకు పోటీగా భూమిక... ఆ పాత్రలకు సై..

భూమిక చావ్లా సుమంత్ 'యువకుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు అగ్రహీరోల సరసన మెరిసింది.

news18-telugu
Updated: March 23, 2020, 9:53 AM IST
రమ్యకృష్ణకు పోటీగా భూమిక... ఆ పాత్రలకు సై..
భూమిక Photo : Facebook
  • Share this:
భూమిక చావ్లా సుమంత్ 'యువకుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఖుషి, మహేష్ ఒక్కడు, ఎన్టీఆర్ సింహాద్రీ మొదలగు సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత కొన్ని ఉమెన్ ఓరియెంటెడ్ సబ్జెక్టులలో కూడా నటించి అదరగొట్టింది. భూమికకు 'మిస్సమ్మ' (2003) చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది. అవకాశాలు తగ్గిన భూమిక పెళ్లి చేసుకుని కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత భూమిక నాని MCAతో రీ ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భూమిక సమంత ప్రధాన పాత్ర పోషించిన యు టర్న్, అక్కినేని నాగ చైతన్య సవ్యసాచి, తాజాగా బాలయ్య రూలర్ సినిమాతో బిజీగానే గడుపుతోంది.  ఖుషి చిత్రంలో పవన్‌కల్యాణ్ సరసన అలవోకగా నటించి మంచి నటిగా  పేరు తెచ్చుకుంది. ఆ ఒక్క సినిమాతోనే భూమికకు చాలా మంది అభిమానులుగా మారారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె టాలెంట్‌. ఆ తర్వాత మరో హిట్ సినిమాలో భూమికా చావ్లా నటించి అభిమానుల మనసు కొల్లగట్టారు. ఆ హిట్ సినిమానే మిస్సమ్మ.

అది అలా ఉంటే ఆ మధ్య మీడియాతో మాట్లాడిన భూమిక ఓ స్టార్ హీరో సినిమాలో తనకు నెగటీవ్ పాత్రలో నటించే అవకాశం దక్కిందని చెప్పింది. వివరాలు అడిగితే మాత్రం ఇప్పుడు చెప్పనని చెప్పేసింది. అయితే ఈ అందాల భామను లేడీ విలన్‌గా త్వరలో చూడనున్నమన్నమాట. అయితే కొన్ని సినిమాల్లో రమ్య కృష్ణ కూడా విలన్‌గా మెప్పించిన మాట తెలిసిందే. మరీ ఈ భామ ఆమెలా అదరగొట్టనుందా.. చూడాలి మరి.
Published by: Suresh Rachamalla
First published: March 23, 2020, 9:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading