భూమికా చావ్లా ఘాటు అందాలు.. నేను సిద్ధం మీరు సిద్ధమా..?

Bhumika Chawla: వ‌య‌సు 40 దాటిపోయినా కూడా ఇంకా రెచ్చిపోయింది భూమిక‌. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే నిజం. ఎందుకంటే త‌న సోష‌ల్ మీడియాలోనే భూమిక చావ్లా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 31, 2020, 10:56 PM IST
భూమికా చావ్లా ఘాటు అందాలు.. నేను సిద్ధం మీరు సిద్ధమా..?
భూమిక చావ్లా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో ఈమె పేరు సంచలనం. వరస విజయాలకు తోడు సంచలన పాత్రలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు కంటే ముందే హిందీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది భూమిక.
  • Share this:
వ‌య‌సు 40 దాటిపోయినా కూడా ఇంకా రెచ్చిపోయింది భూమిక‌. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే నిజం. ఎందుకంటే త‌న సోష‌ల్ మీడియాలోనే భూమిక చావ్లా ఈ హాట్ ఫోటోల‌ను షేర్ చేసింది. ఉన్న‌ట్లుండి ఇలా రెచ్చిపోవ‌డానికి కార‌ణ‌మేంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. భూమికకు ఒక‌ప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో కుర్రాళ్ల‌కు తార‌క‌మంత్రం. మిలీనియం మొదట్లో ఖుషీ లాంటి సంచ‌ల‌న సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ సినిమాలో అమ్మడు నడుము సీన్ ఇప్పటికీ సంచలనమే.
భూమిక చావ్లా హాట్ షో (bhumika chawla hot)
భూమిక చావ్లా హాట్ షో (bhumika chawla hot)


ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా భూమికను మాత్రం ఖుషీ హీరోయిన్‌గానే గుర్తు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఆ త‌ర్వాత కూడా ఒక్క‌డు, సింహాద్రి లాంటి ఇండ‌స్ట్రీ హిట్స్ లో న‌టించింది భూమిక‌. భ‌ర‌త్ ఠాకూర్‌తో పెళ్ళైన త‌ర్వాత సినిమాల‌కు కొన్నాళ్ల పాటు దూరంగా ఉంది భూమిక‌. ఆ త‌ర్వాత బాలీవుడ్ వెళ్లి అక్క‌డ కొన్ని రోజులు సినిమాలు చేసింది. ఎమ్మెస్ ధోనీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది భూమిక‌. ఈ చిత్రంతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చింది భూమిక చావ్లా.
భూమిక చావ్లా హాట్ షో (bhumika chawla/Facebook)
భూమిక చావ్లా హాట్ షో (bhumika chawla/Facebook)

ఆ త‌ర్వాత తెలుగులో నాని హీరోగా వ‌చ్చిన ఎంసిఏ సినిమాతో అద‌ర‌గొట్టింది. అయితే అక్క‌, వ‌దిన పాత్ర‌ల‌కు ఫిక్సైపోతున్న ఈ స‌మ‌యంలో ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఇలా రెచ్చిపోవ‌డం వెన‌క అస‌లు కార‌ణ‌మేంటో అని అంతా త‌ల ప‌ట్టుకుంటున్నారు. ఈ మధ్యే బాలయ్య రూలర్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించింది. అయితే సినిమా ఫ్లాప్ కావడంతో ఎవరికీ తెలియదు అంతే. ఏదేమైనా హాట్ షోతో ఇప్పుడు మ‌తులు చెడ‌గొడుతుంది భూమిక‌. ఇప్ప‌టికీ ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేస్తూ ఔరా అనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఈ ఫోటోషూట్ ఆమెకు కొత్త అవ‌కాశాలు తీసుకొస్తుందో లేదో చూడాలిక‌.
Published by: Praveen Kumar Vadla
First published: May 31, 2020, 10:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading