Bhuj Trailer Talk: అజయ్ దేవ్‌గణ్ ‘భుజ్’ ట్రైలర్ విడుదల.. అదిరిపోయిన యాక్షన్ సీక్వెన్స్..

అజయ్ దేవ్‌గణ్ ‘భుజ్’ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ట్రైలర్ విడుదల (Twitter/Photo)

Ajay Devgn Bhuj The Pride Of India Trailer Talk | బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భుజ్’. ఎపుడు విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా లేట్ అయింది. ముందుగా థియోట్రికల్ రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రాన్ని డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

  • Share this:
    Ajay Devgn Bhuj The Pride Of India Trailer Talk | బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భుజ్’. ఎపుడు విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా లేట్ అయింది. ముందుగా థియోట్రికల్ రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రాన్ని డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 1971లో జరిగిన భారత్ -  బంగ్లాదేశ్ యుద్ధ నేపథ్యంలో జరిగిన నిజ జీవిత ఘటనల నేపథ్యంలో ‘భుజ్’ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా  సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ మరోసారి ఎయిర్‌ఫోర్స్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.  అభిషేక్ దుదియా దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో ప్రణీత సుభాష్, శరత్ ఖేల్‌కర్ కూడా ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ కూడా అదిరిపోయే యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది.

    1971లో బంగ్లాదేశ్ విముక్తి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ ప్రాంతంలో ఎయిర్ బేస్‌ను పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానాలు ధ్వంసం చేసి మన సైనికుల మనో ధైర్యాన్ని దెబ్బ తీస్తాయి. పాకిస్థాన్‌ సరిహద్దుకు అత్యంత సమీపంలోని ఎయిర్‌బేస్ మన దేశానికి సంబంధించినంత వరకు అత్యంత కీలకమైన ప్రాంతం.

    దేశ భద్రతకు అత్యంత కీలమైన ఈ ఎయిర్‌బేస్ బాధ్యతను స్వాడ్రన్ లీడర్ విజయ్ కుమార్ కార్నిక్ (అజయ్ దేవ్‌గణ్)కు అప్పగిస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ 100 ట్యాంకుల రెజిమెంట్‌తో 1800 సైనికులతో భుజ్ ప్రాంతాన్ని అటాక్ చేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో స్వాడ్రన్ లీడర్  అజయ్ దేవ్‌గణ్ అక్కడి స్థానికుల సహకారంలో భుజ్ ఎయిర్ బేస్‌ను పున: నిర్మించి పాకిస్థాన్ ముష్కర మూకల నుంచి భారత్‌ను ఎలా కాపాడనేది ఈ సినిమా స్టోరీ. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో గుజరాత్‌లోని ‘భుజ్’ ప్రాంతం ఎలాంటి కీలక భూమిక వహించనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపెట్టారు దర్శకుడు అభిషేక్ దూదయ్య. రోమాలు నిక్కపొడుచుకునే రీతిలో యాక్షన్ సన్నివేశాలున్నాయి. ఈ చిత్రాన్ని ఆగష్టు 13న డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల చేయనున్నారు. అజయ్ దేవ్‌గణ్ విషయానికొస్తే.. గతేడాది ‘తానాజీ’ తర్వాత ఈయన హీరోగా నటించిన సినిమా ‘భుజ్’. ఈ సినిమాతో పాటు అజయ్ దేవ్‌గణ్.. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘మైదాన్’ సినిమాలు కూడా విడుదలకు రెడీగా ఉన్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: