వయసు 40కి చేరువవుతుంటే ఇప్పుడు రెచ్చిపోయింది భూమిక. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే నిజం. ఎందుకంటే తన సోషల్ మీడియాలోనే భూమిక చావ్లా ఈ హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఉన్నట్లుండి ఇలా రెచ్చిపోవడానికి కారణమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. భూమికకు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కుర్రాళ్లకు తారకమంత్రం. మిలీనియం మొదట్లో ఖుషీ లాంటి సంచలన సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో అమ్మడు నడుము సీన్ ఇప్పటికీ సంచలనమే.
ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా భూమికను మాత్రం ఖుషీ హీరోయిన్‌గానే గుర్తు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఆ తర్వాత కూడా ఒక్కడు, సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్స్ లో నటించింది భూమిక. భరత్ ఠాకూర్‌తో పెళ్ళైన తర్వాత సినిమాలకు కొన్నాళ్ల పాటు దూరంగా ఉంది భూమిక. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడ కొన్ని రోజులు సినిమాలు చేసింది. ఎమ్మెస్ ధోనీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది భూమిక. ఈ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది భూమిక చావ్లా.
ఆ తర్వాత తెలుగులో నాని హీరోగా వచ్చిన ఎంసిఏ సినిమాతో అదరగొట్టింది. అయితే అక్క, వదిన పాత్రలకు ఫిక్సైపోతున్న ఈ సమయంలో ఇప్పుడు ఉన్నట్లుండి ఇలా రెచ్చిపోవడం వెనక అసలు కారణమేంటో అని అంతా తల పట్టుకుంటున్నారు. ఏదేమైనా హాట్ షోతో ఇప్పుడు మతులు చెడగొడుతుంది భూమిక. ఇప్పటికీ పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేస్తూ ఔరా అనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ ఫోటోషూట్ ఆమెకు కొత్త అవకాశాలు తీసుకొస్తుందో లేదో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hot Photoshoot, Nani, Pawan kalyan, Telugu Cinema, Tollywood