Home /News /movies /

BHOOL BHULAIYAA 2 KARTIK AARYAN KIARA ADVANI TABU BHOOL BHULAIYAA 2 MOVIE GOT SUPER HIT AT BOLLYWOOD BOX OFFICE TA

Bhool Bhulaiyaa 2 : బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భూల్ భులయ్యా’ ధమాకా.. రూ. 100 కోట్లు మైలు రాయిని దాటిన కార్తీక్ ఆర్యన్ మూవీ..

రూ. 100 కోట్ల క్లబ్బులో కార్తీక్ ఆర్యన్ ‘భూల్ భులయ్యా 2’ (Twitter/Photo)

రూ. 100 కోట్ల క్లబ్బులో కార్తీక్ ఆర్యన్ ‘భూల్ భులయ్యా 2’ (Twitter/Photo)

Bhool Bhulaiyaa 2 : బాలీవుడ్‌లో 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’(The Kashmir Files) మూవీ సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన ‘భూల్ భులయ్యా 2’ సినిమా సూపర్ హిట్ టాక్‌తో మంచి వసూళ్లతో దూసుకుపోతుంది.

ఇంకా చదవండి ...
    Bhool Bhulaiyaa 2 : గత కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాలేవి బాక్సాఫీస్ దగ్డర పెద్దగా అలరించలేకపోతున్నాయి. గతేడాది చివర్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ‘సూర్యవంశీ’ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పోస్ట్ ప్యాండమిక్ తర్వాత రూ. 200 కోట్లకు పైగా వసూళు చేసింది. ఆ తర్వాత 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’(The Kashmir Files) మూవీ సంచలన విజయం సాధించింది. రూ. 20 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా  ఓవరాల్‌గా రూ. 350 కోట్లకు గ్రాస్ వసూళ్లతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరనే కాదు.. మొత్తం భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఆర్ఆర్ఆర్(RRR), కేజీఎఫ్ 2 (KGF Chapter 2) మూవీ కంటే ఎక్కువ లాభాలను ఈ సినిమానే తీసుకొచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో వచ్చిన జాన్ అబ్రహం ‘ఎటాక్’, (Attack) షాహిద్ కపూర్ ‘జెర్సీ’ (Jersey) , రణ్‌వీర్ సింగ్ ‘జయేష్ భాయ్ జోర్దార్’, కంగనా ‘ధాకడ్’  సినిమాలేవి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అసలు ప్రభావమే చూపించలేకపోయాయి.

    మధ్యలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి ప్యాన్ ఇండియ ా సినిమాలు మాత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇరగదీసాయి. తాజాగా ఈ యేడాది మే 20న విడుదలైన ‘భూల్ భులయ్యా 2’ సినిమా బాలీవుడ్‌లో సంచలనాలు నమోదు చేస్తోంది. అక్షయ్ కుమార్, విద్యాబాలన్ నటించిన ‘భూల్ భులయ్యా’ సినిమాకు సీక్వెల్‌గా ఈసినిమాను తెరకెక్కించారు. ఇక భూల్ భులయ్యా సినిమా రజినీకాంత్ ‘చంద్రముఖి’కి రీమేక్‌గా తెరకెక్కి అప్పట్లో  మంచి హిట్ సాధించింది.

    HBD Super Star Krishna : తెలుగు సినీ టార్చ్‌బేరర్ సూపర్ స్టార్ కృష్ణ.. అన్నింట్లో ముందు నటశేఖరుడే..

    ఇపుడు ఆ ‘భూల్ భులయ్యా’ సినిమాకు సీక్వెల్‌గా ఓ హార్రర్ కామెడీ కథను సొంతంగా రెడీ చేసుకొని దర్శకుడు అనీస్ బజ్మీ. ఆయన  దర్శకత్వంలో తెరకెక్కిన ‘భూల్ భులయ్యా 2’ (Bhool Bhulaiyaa 2) సినిమాకు మొదటి రోజు మొదటి ఆట నుంచే బాలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. మొత్తంగా హార్రర్ కామెడీలకు తిరుగుండదని మరోసారి ‘భూల్ భులయ్యా 2’తో ప్రూవ్ చేసింది.  ఈ సినిమా రోజుకు రోజుకు తన కలెక్షన్స్ పికప్ చేసుకుంటూ వెళుతోంది. తాజాగా ఈ సినిమా పది రోజుల్లో రూ. 128 కోట్లకు పైగా రాబట్టి.. త్వరలో రూ. 150 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. మొత్తంగా బాలీవుడ్‌లో సరైన హిట్టు లేని సమయంలో కార్తీక్ ఆర్యన్ ఇపుడు ‘భూల్ భులయ్యా 2’ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకోవడంతో బాలీవుడ్ నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు.


    ‘భూల్ భులయ్యా (Bhool Bhulaiayaa 2) సినిమాలో హీరోగా నటించిన కార్తీక్ ఆర్యన్ విషయానికొస్తే.. ఈయన 2011లో ‘ప్యార్ కా పంచ్‌నామా’ సినిమాతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘ఆకాశ్ వాణి’, ‘కాంచీ’, ప్యార్ కా పంచ్‌నామా 2’తో పాటు ‘సోనూ కీ టీటూ కీ స్వీటీ’తో పాటు ‘లుకా చుప్పి, పతీ పత్నీ ఔర్ ఓ’ సినిమాలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా ఇపుడు ‘భూల్ భులయ్యా 2’ మూవీతో కార్తీక్ ఆర్యన్ తన ఖాతాలో మరో సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఎంత మేరకు వసూళ్లను రాబడుతోందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bhool Bhulaiyaa 2, Bollywood news, Kartik Aaryan, Kiara advani, Tabu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు