Chiranjeevi - Bhola Shankar - : మెగాస్టార్ చిరంజీవిప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా కంప్లీటైంది. ఈ సినిమా తర్వాత మలయాళీ రీమేక్ చిత్రం గాడ్ ఫాదర్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. అన్నాచెల్లెల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి సరసన తమన్నా (Tamannaah) హీరోయిన్గా నటిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘సైరా.. నరసింహారెడ్డి’ చిత్రంలో తమన్నా (Tamannaah) తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
దీంతో చిరంజీవితో ఆమెకి ఇది రెండో సినిమా. ఈనె 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారు. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో జబర్ధస్త్‌తో పాటు బిగ్‌బాస్‌కు సంబంధించిన టీమ్ మెంబర్స్‌ను తీసుకున్నట్టు ఓ ట్వీట్ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. భోళా శంకర్ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలనీ చిరంజీవి దర్శకుడికి షరతు పెట్టారట. అందులో భాగంగా ఈ సినిమా చిత్రీకరణ కేవలం 40 నుండి 50 రోజుల్లో పూర్తి అయ్యేట్లు ప్లాన్ చేశారట చిత్రబృందం.
#Srimukhi ni oka cinema lo tiskunta annaru alagey chesaru, Kastaallo unna Uttej ni marchipoledu, Ayana ki anti ga velli na Raghu babu ni kuda mundu row lo pettaru. Indukey kada #Chiranjeevi garu antey industry antha padi chacchedi.#BholaShankar #Chiranjeevi #rrr #chiru153 pic.twitter.com/rmsWrDjgND
— ChiRRRu fan (@Paagal_lo_Prem) November 11, 2021
ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో రఘుబాబు, రవి శంకర్, మురళీ శర్మ, రావు రమేష్, వెన్నెల కిషోర్, సత్య, శ్రీముఖి, రష్మి గౌతమ్, బిత్తిరి సత్తి, సత్య,ప్రగతి, సత్య ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఓ వార్త వైరల్ అవుతోంది.
Chiranjeevi : చిరంజీవికి మెగాస్టార్ బిరుదు వెనక ఇంత పెద్ద కథ ఉందా..
చిరంజీవి నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ (Lucifer) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు.
Balakrishna - Srinu Vaitla : బాలయ్యతో శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమా తెలుసా..
చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Rashmi Gautam, Sreemukhi, Tamannaah, Tollywood