హోమ్ /వార్తలు /సినిమా /

Bhola Shankar - Tamannaah : భోళా శంకర్‌లో చిరంజీవి సరసన తమన్నా ఖరారు.. అధికారిక ప్రకటన..

Bhola Shankar - Tamannaah : భోళా శంకర్‌లో చిరంజీవి సరసన తమన్నా ఖరారు.. అధికారిక ప్రకటన..

ఇప్పటి వరకు బాలీవుడ్‌లో సినిమాలు చేసినా కూడా గ్లామరస్ కోణంలోనే చేసింది. కానీ తమన్నా మొదటిసారి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తుంది. మరి ఈ సినిమాతో తమన్నా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. మరోవైపు తెలుగులోనూ ఈమె బిజీగానే ఉంది. ఇక్కడ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3లో నటిస్తుంది. ఇందులో వెంకటేష్‌కు జోడీగా నటిస్తుంది తమన్నా.

ఇప్పటి వరకు బాలీవుడ్‌లో సినిమాలు చేసినా కూడా గ్లామరస్ కోణంలోనే చేసింది. కానీ తమన్నా మొదటిసారి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తుంది. మరి ఈ సినిమాతో తమన్నా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. మరోవైపు తెలుగులోనూ ఈమె బిజీగానే ఉంది. ఇక్కడ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3లో నటిస్తుంది. ఇందులో వెంకటేష్‌కు జోడీగా నటిస్తుంది తమన్నా.

Bhola Shankar - Tamannaah : మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా కంప్లీటైంది. తాజాగా ఈ సినిమాలో తమన్నాను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసారు.

ఇంకా చదవండి ...

    Bhola Shankar - Tamannaah : మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా కంప్లీటైంది. ఈ సినిమా తర్వాత  మలయాళీ రీమేక్ చిత్రం గాడ్ ఫాదర్‌ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. అన్నాచెల్లెల అనుబంధం నేపథ్యంలో ఈ  సినిమాను తెరకెక్కిస్తున్నారు.  కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో తమన్నాను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసారు.  కాగా తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే.

    సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘సైరా.. నరసింహారెడ్డి’  చిత్రంలో తమన్నా (Tamannaah) తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో చిరంజీవితో ఆమెకి ఇది రెండో సినిమా అని చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ నవంబర్ 11నుంచి లాంఛనంగా ప్రారంభంకానుంది. అదే నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారు. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.

    తాజాగా ఈ సినిమాకు సంబంధించిన చిరంజీవిపై మెహర్ రమేష్ టెస్ట్ షూట్ నిర్వహించారు. ఇక చిరంజీవి నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

    Chiranjeevi : చిరంజీవికి మెగాస్టార్ బిరుదు వెనక ఇంత పెద్ద కథ ఉందా..

    మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ (Lucifer) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసి తెరకెక్కించారు.

    Balakrishna - Srinu Vaitla : బాలయ్యతో శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమా తెలుసా..

    ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bhola Shankar, Chiranjeevi, Meher ramesh, Tamannaah, Tollywood

    ఉత్తమ కథలు