ఈ మధ్యకాలంలో వరుసగా సినిమా ఇండస్ట్రీలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు ఆకస్మికంగా మృతిచెందుతూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే సూసైడ్‌కు పాల్పడింది. అతి చిన్న వయసులోనే ఆమె మృతి అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది. ఆకాంక్ష వయసు 25 ఏళ్లు. వివరాల్లోకి వెళ్తే.. సారనాథ్ ప్రాంతంలోని తన హోటల్ గదిలో ఆమె ఉరి వేసుకుని కనిపించింది.
ప్రస్తుతం ఆకాంక్ష ఓ సినిమా షూటింగ్ నిమిత్తం వారణాసిలో ఉంది. మేరు జంగ్ మేరా ఫైస్లా చిత్రంతో ఈ నటి తెరంగేట్రం చేసింది. ఆమె ముజ్సే షాదీ కరోగి, వీరన్ కే వీర్ , ఫైటర్ కింగ్ వంటి భోజ్‌పురి చిత్రాలలో కనిపించింది. ఆకాంక్ష తన మ్యూజిక్ వీడియోలకు కూడా ప్రసిద్ది చెందింది. ఆకాంక్ష.. తన కొత్త సినిమా నాయక్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ప్రస్తుతానికి ఆమె ఆత్మహత్యకు కారణాలు ఏంటో ఇంకా తెలియలేదు.
అయితే ఒక రోజు క్రితం, శనివారం రాత్రి, ఆకాంక్ష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన వీడియోను షేర్ చేసింది. ఒక నెల క్రితం, నటి ప్రేమికుల రోజున ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా వార్తలను షేర్ చేసింది. సహనటుడు సమర్‌సింగ్‌తో కలిసి ఫోటోలను షేర్ చేసింది. హ్యాపీ వాలెంటైన్స్ డే' అని పోస్టు చేసింది. దీంతో ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఆకాంక్ష అక్టోబర్ 21, 1997న ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జన్మించింది. చిన్నప్పటి నుంచి డ్యాన్స్, యాక్టింగ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. టిక్‌టాక్ , ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన తన డ్యాన్స్ , యాక్టింగ్ వీడియోలను పంచుకోవడం ద్వారా ఆమె సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.