నితిన్ భీష్మ సినిమా రెండో రోజు కలెక్షన్స్ పరిస్థితి ఏంటి..

Bheeshma 2 days Collections: సంక్రాంతికి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి విజయాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలే దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసాయి. ఇలాంటి ఓపెనింగ్ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 22, 2020, 10:27 PM IST
నితిన్ భీష్మ సినిమా రెండో రోజు కలెక్షన్స్ పరిస్థితి ఏంటి..
భీష్మలో రష్మిక, నితిన్ (Bheeshma 2 days collections)
  • Share this:
సంక్రాంతికి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి విజయాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలే దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసాయి. ఇలాంటి ఓపెనింగ్ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన డిస్కో రాజా, వరల్డ్ ఫేమస్ లవర్, జాను లాంటి సినిమాలు కూడా డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో పూర్తిగా కళ తప్పింది బాక్సాఫీస్. ఇలాంటి సమయంలో కరువు తీర్చేస్తున్నాడు నితిన్. ఈయన నటించిన భీష్మ సినిమాకు తొలిరోజే మంచి టాక్ వచ్చింది. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమా తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. 24 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన భీష్మ కచ్చితంగా ఫస్ట్ వీక్‌లోనే బయ్యర్లను సేఫ్ జోన్ కాదు లాభాల్లోకి తీసుకొచ్చేలా కనిపిస్తున్నాడు.
మహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్ రికార్డులు

ఈ చిత్రం రెండో రోజు కూడా అన్ని చోట్లా హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4 నుంచి 5 కోట్ల మధ్యలో షేర్ వచ్చేలా కనిపిస్తుంది. మీడియం రేంజ్ సినిమాకు.. నితిన్ లాంటి హీరోకు రెండో రోజు అన్ని వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. ఛలో బ్లాక్‌బస్టర్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని వెంకీ.. శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని నితిన్ చేసిన సినిమా ఇది. బాక్సాఫీస్ దగ్గర లెక్కలు చూస్తుంటే రెండో రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్లకు పైగానే షేర్ రావడం ఖాయంగా కనిపిస్తుంది.

భీష్మలో రష్మిక, నితిన్ (Bheeshma 2 days collections)
భీష్మలో రష్మిక, నితిన్ (Bheeshma 2 days collections)

అందులోనూ నైజాంలో రెండో రోజు కూడా దాదాపు కోటిన్నర వరకు షేర్ తీసుకొచ్చేలా కనిపిస్తున్నాడు నితిన్. తొలిరోజు ఇక్కడ 2 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఓవర్సీస్‌లో కూడా తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు పెరిగాయి. అక్కడ ఇప్పటికే 3 లక్షల డాలర్లు వసూలు చేసింది భీష్మ. రష్మిక గ్లామర్ షో.. నితిన్ పర్ఫార్మెన్స్.. వెన్నెల కిషోర్ కామెడీ భీష్మ సినిమాకు హైలైట్. ఇక త్రివిక్రమ్ రేంజ్‌లో వెంకీ కుడుముల కూడా పంచ్ డైలాగులతో పిచ్చెక్కించాడు. వీకెండ్ ముగిసేలోపే భీష్మ కచ్చితంగా 20 కోట్ల క్లబ్‌లో చేరిపోయేలా కనిపిస్తుంది.

First published: February 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు