Bheeshma Collections : నితిన్, రష్మిక మందన హీరో హీరోయిన్స్‌గా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో 'భీష్మ' అనే రొమాంటిక్ కామెడీ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. శివరాత్రి కానుకగా నిన్న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు వెంకీ కుడుములు అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. దీంతో ఈ చిత్రం మొదటిరోజు వసూళ్లు వర్షం కురిపించింది. నైజాం లో భీష్మ 2.21 కోట్ల షేర్ రాబట్టింది. ఇది నితిన్ నైజాం కెరీర్ సెకండ్ బెస్ట్ . నితిన్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అ ఆ..2.30 కోట్లతో అతని కెరీర్ బెస్ట్ గా ఉంది. ఓవర్ ఆల్‌గా తెలుగు రాష్ట్రాలలో భీష్మ మొదటిరోజు బెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకుందని సమాచారం. భీష్మ చిత్రానికి సరైన ప్రమోషన్స్ చేసి జనాల్లోకి వెళ్లేట్టు చేసింది చిత్రబృందం. అందులో భాగంగా ఫస్ట్ గ్లింప్స్ అంటూ నితిన్, రష్మిక మధ్య కెమిస్ట్రీని హైలెట్ చేయడం, టీజర్ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగేలా చేశాయి. మరోవైపు భీష్మ విషయంలో మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ఉంది. కథ కొత్తది కాకపోయినా.. ఆద్యంతం వినోదభరితంగా ఉండటం, పంచ్ డైలాగ్స్, పాటలు, డ్యాన్సులు, ఇలా కమర్షియల్ చిత్రానికి కావాల్సిన హంగులన్నీ ఉండటం కలిసివస్తోంది.
దీనికి తోడు మరే చిత్రం కూడా పోటీలో లేకపోవడంతో దాదాపు థియేటర్లన్నీ భీష్మతోనే నిండిపోయాయని సమాచారం. ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు భీష్మ.. దాదాపు 5.5 కోట్ల నుంచి ఆరు కోట్ల మధ్య వసూళ్లు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భీష్మ చిత్రంలో నితిన్‌కు జంటగా హీరోయిన్ రష్మిక మందన నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. సంగీతం మహతి స్వర సాగర్ అందించాడు.
#Bheeshma
1st Day
AP and TS Shares
Nizam 2.20Cr
Ceeded 0.80
Vizag 0.62
Guntur 0.77
East 0.66
West 0.56
Krishna 0.40
Nellore 0.27
Total Share 6.28cr#BheeshmaDay
— Tollywood Infos (@TollywoodInfos) February 22, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.