హోమ్ /వార్తలు /సినిమా /

Bheeshma Collections : బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోన్న భీష్మ

Bheeshma Collections : బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోన్న భీష్మ

భీష్మలో నితిన్ Photo : Twitter

భీష్మలో నితిన్ Photo : Twitter

Bheeshma Second day Collections : నితిన్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో వెంకి కుడుముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం భీష్మ.. బాక్సాఫీస్ దగ్గర ఇరగదీస్తోంది.

Bheeshma Second day Collections : నితిన్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో వెంకి కుడుముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం భీష్మ. 'ఛలో' వంటి రొమాంటిక్ కామెడీ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం తగ్గకుండా విడుదలైన రోజునుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమాను దర్శకుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించాడు. దీంతో ఈ చిత్రం మొదటిరోజు వసూళ్లు వర్షం కురిపించింది. నైజాం లో భీష్మ 2.21 కోట్ల షేర్ రాబట్టింది. ఇది నితిన్ నైజాం కెరీర్ సెకండ్ బెస్ట్ . నితిన్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అ ఆ.. 2.30 కోట్లతో అతని కెరీర్ బెస్ట్‌గా ఉంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో భీష్మ మొదటిరోజు బెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకుంది. అందులో భాగంగా మొదటి రోజే దాదాపు ఆరు కోట్లు కొల్లగొట్టి భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. దీంతో చిత్రయూనిట్ సంబరాల్లో మునిగి తేలుతోంది. భీష్మ రెండో రోజూ అదే వసూళ్ల స్పీడ్‌ను కొనసాగించింది.

అందులో భాగంగా రెండో రోజు భీష్మ దాదాపు 5.0కోట్ల వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 8.10కోట్లు అని సమాచారం. దీంతో భీష్మ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు చేరుకుందని అంటున్నారు సినీ పండితులు. ఈ రెండు రోజుల్లోనే భీష్మ 13.03కోట్ల షేర్‌ను, 19.30కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు సమాచారం. కాగా భీష్మ చిత్రం దాదాపు 23కోట్లకు అమ్ముడు పోగా.. రెండో రోజుతోనే దాదాపు సగం రాబట్టేసింది. ఇదే జోరును కొనసాగిస్తే మరో రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవ్వనుంది. భీష్మకు మొదటి నుండి పాజిటివ్ వైబ్ ఉండడంతో పాటు సరైన ప్రమోషన్స్ చేసిన చిత్రబృందం సినిమాను జనాల్లోకి వెళ్లేట్టు చేసింది. దీనికి తోడు నితిన్, రష్మిక మధ్య కెమిస్ట్రీ అదరడం, ఆద్యంతం వినోదభరితంగా ఉండటం, పంచ్ డైలాగ్స్, పాటలు, డ్యాన్సులు, ఇలా కమర్షియల్ చిత్రానికి కావాల్సిన హంగులన్నీ ఉండటం కలిసివస్తోంది.

First published:

Tags: Bheeshma, Nithiin

ఉత్తమ కథలు