Bheeshma Collections : వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో తాజాగా విడుదలైన చిత్రం భీష్మ. శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. దర్శకుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించడంతో ఈ చిత్రం మొదటిరోజు నైజాం లో 2.21 కోట్ల షేర్ రాబట్టింది. ఇది నితిన్ నైజాం కెరీర్ సెకండ్ బెస్ట్ . నితిన్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అ ఆ.. 2.30 కోట్లతో అతని కెరీర్ బెస్ట్‌గా ఉంది. తెలుగు రాష్ట్రాలలో భీష్మ మొదటిరోజు బెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకుని.. దాదాపు ఆరు కోట్లు కొల్లగొట్టి భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఈసినిమా రెండో రోజు అదే స్పీడ్‌ను కొనసాగించింది. రెండో రోజు భీష్మ దాదాపు 5.0కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 8.10కోట్లు అని సమాచారం. దీంతో భీష్మ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు చేరుకుందని అంటున్నారు సినీ పండితులు. ఈ రెండు రోజుల్లోనే భీష్మ 13.03కోట్ల షేర్‌ను, 19.30కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు సమాచారం. మూడో రోజు కూడా భీష్మ మంచి వసూళ్లనే రాబట్టినట్లు తెలుస్తోంది.
#Bheeshma #BlockbusterBheeshma
Organic fun filled Blockbuster
Crossed 600k mark in USA 🔥🔥🔥🔥@actor_nithiin @iamRashmika @VenkyKudumula @mahathi_sagar @saisriram_dop @sahisuresh @vamsi84 @SVR4446 @adityamusic @SitharaEnts #BheeshmaOnFeb21st pic.twitter.com/B3erjlahXE
— BlueSkyCinemas (@Blueskycinemas) February 23, 2020
అటు ఓవర్సీస్‌లో కూడా భీష్మ అదరగొడుతోంది. ప్రీమియర్లతో కలుపుకుని ఆదివారం వరకు 'భీష్మ' చిత్రం యూఎస్‌లో సుమారు రూ. 4 కోట్లకు పైగా రాబట్టింది. ఓవర్‌సీస్‌లో 'భీష్మ' థియేట్రికల్ రైట్స్‌ను రూ.2.4 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఇప్పటికే సుమారుగా రూ.2.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ 'భీష్మ' కాసుల వర్షం కురిపిస్తోంది. ఆదివారం ముగిసే సరికి ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 14.52 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. ఆదివారం కూడా హౌస్‌ఫుల్ షోలతో అదరగొట్టింది. కాగా భీష్మ చిత్రం దాదాపు 23కోట్లకు అమ్ముడు పోగా.. రెండో రోజుతోనే దాదాపు సగం రాబట్టేసింది. ఇదే జోరును కొనసాగిస్తే మరో రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవ్వనుంది. భీష్మకు మొదటి నుండి పాజిటివ్ వైబ్ ఉండడంతో పాటు సరైన ప్రమోషన్స్ చేసిన చిత్రబృందం సినిమాను జనాల్లోకి వెళ్లేట్టు చేసింది. దీనికి తోడు నితిన్, రష్మిక మధ్య కెమిస్ట్రీ అదరడం, ఆద్యంతం వినోదభరితంగా ఉండటం, పంచ్ డైలాగ్స్, పాటలు, డ్యాన్సులు, ఇలా కమర్షియల్ చిత్రానికి కావాల్సిన హంగులన్నీ ఉండటంతో పాటు మరే సినిమా విడుదల లేకపోవడం సినిమాకు మరింతగా కలిసివస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.