రొమాంటిక్ ఉంటుందనుకున్న.. 30 మినిట్స్‌కే బోర్ కొట్టింది : రష్మిక మందన

Bheeshma :  నితిన్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో 'భీష్మ' వస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల తేదీ దగ్గరపడడంతో ప్రచారంలో భాగంగా రష్మిక మీడియాతో మాట్లాడింది.

news18-telugu
Updated: February 16, 2020, 4:41 PM IST
రొమాంటిక్ ఉంటుందనుకున్న.. 30 మినిట్స్‌కే బోర్ కొట్టింది : రష్మిక మందన
రష్మిక మందన Twitter
  • Share this:
Bheeshma :  నితిన్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. దీంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరోయిన్ రష్మిక మందన మీడియాతో మాట్లాడింది. ఆ విశేషాలేంటో చూద్దాం.. వాలెంటైన్స్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ? అన్న ప్రశ్నకు సమాదానంగా రష్మిక.. ఈ వాలెంటైన్స్ డే నాకు చాల బోర్‌గా సాగింది. ఒక రొమాంటిక్ సినిమా చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటే 30 మినిట్స్‌కే ఆ సినిమా బోర్ కొట్టింది. ఆ మూవీ ఇంగ్లీష్ మూవీలేండి… మళ్ళీ ఏ తెలుగు మూవీ అని అడుగుతారని తెలిపింది. తన స్టార్ డమ్ గురించి మాట్లాడుతూ.. మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకుని, క్యారెక్టర్‌కు తగ్గట్టు కష్టపడి బాగా చేయాలి. అంతే తప్ప అవ్వన్నీ లక్ వల్ల రావు. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే అది నా హార్డ్ వర్క్ వల్లే అని పేర్కోంది. భీష్మలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘భీష్మ’లో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నేను చేసిన డాన్స్, నా యాక్టింగ్ కూడా బాగా వచ్చాయి. అన్నిటికి మించి సినిమాలో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారంది.

భీష్మలో నితిన్, రష్మిక మందన Twitter


ఇక ఈ సినిమాలో కుమారి 21 ఎఫ్‌తో ఆకట్టుకున్న హెబ్బా పటేల్ కీలక పాత్రలో కనిపించనుంది. ‘భీష్మ’ సినిమా రిలీజ్ దగ్గరపడడంతో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 17న ఘనంగా జరగనుంది. ఈ ఈవెంట్‌కు అల వైకుంఠపురములోతో సూపర్ హిట్ అందుకున్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా రానున్నాడు.

First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు