Home /News /movies /

Rana Daggubati | Bheemla Nayak: భీమ్లా నాయక్‌లో రానా దగ్గుబాటి సరసన నటించేది ఎవరంటే... లీక్ చేసిన హీరోయిన్...

Rana Daggubati | Bheemla Nayak: భీమ్లా నాయక్‌లో రానా దగ్గుబాటి సరసన నటించేది ఎవరంటే... లీక్ చేసిన హీరోయిన్...

Rana daggubati in Bheemla Nayak Photo : Twitter

Rana daggubati in Bheemla Nayak Photo : Twitter

Rana Daggubati | Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati)లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ”భీమ్లా నాయక్” (Bheemla Nayak). ఈ సినిమా మలయాళీ సినిమా అయ్యప్పనుమ్ కోషీయమ్ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. కాగా ఈ సినిమాలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన మలయాళీ భామ సంయుక్తా మీనన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ”భీమ్లా నాయక్” (Bheemla Nayak). యువ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మలయాళీ సినిమా అయ్యప్పనుమ్ కోషీయమ్ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. కాగా ఈ సినిమాలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన మలయాళీ భామ సంయుక్తా మీనన్ నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు రాగా.. ఈ విషయాన్ని సంయుక్తా మీనన్ లీక్ చేసింది. భీమ్లా నాయక్ సినిమాలో స్క్రీన్ పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది సంయుక్తా మీనన్. దీంతో ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోపవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ కింద యాబై కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ రాగా.. తాజాగా రానా పారితోషికం గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

    ఈ సినిమా కోసం రానా 25 రోజుల కాల్షీట్లు కేటాయించారని నిర్మాతలు రానాకు 4 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రానా పాత్రను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రగా చూపించనున్నారని టాక్. రానా టీజర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

    MAA Elections : ఢీ అంటే ఢీ అంటోన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు.. అభ్యర్థుల తుది జాబితా ఇదే..

    ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి (Rana Daggubati) పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా నిత్యా మీనన్, (Nithya menen) సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలకానుంది. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.


    ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఓ పాటను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శనం మొగులయ్య పాడిన ఈ పాట ఎంతోగాను ఆకట్టుకుంది.

    ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన భీమ్లా నాయక్‌తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ప్రకటించారు.

    Kondapolam : కర్నూలులో ఘనంగా వైష్ణవ్ తేజ్ కొండపొలం ప్రీ రిలీజ్ ఈవెంట్...

    ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. పవన్ బర్త్ డే సందర్భంగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే సినిమాను ఖరారు చేశారు.

    ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్.

    ఇక రానా సినిమాల విషయానికి వస్తే.. ఆ మధ్య అరణ్య అనే సినిమాతో వచ్చారు. ఈ సినిమాలో అడవి, అడవి జంతువుల నేపథ్యంలో వాటి హక్కులు రక్షణ గురించి చర్చించారు. ఇక ఆయన ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ ఈ సినిమాను నిర్మించనున్నారు.

    ఈ సినిమాకు 'గృహం' ఫేమ్‌ డైరెక్టర్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్నాడని టాక్. మిలింద్ రావ్ తాజాగా (Nayanthara) నయనతార ప్రధాన పాత్రలో 'నెట్రికన్' అనే మిస్టరీ థ్రిల్లర్ ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు ధీరుడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ఆయన ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్ రానాలు కలిసి నటిస్తున్నారు. దీనికి రానా నాయుడు అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు