హోమ్ /వార్తలు /సినిమా /

Bheemla Nayak Trailer Talk : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ టాక్.. ఎలా ఉందంటే..

Bheemla Nayak Trailer Talk : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ టాక్.. ఎలా ఉందంటే..

పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ టాక్ (Twitter/Photo)

పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ టాక్ (Twitter/Photo)

Pawan Kalyan - Bheemla Nayak Trailer Talk : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి మరో కథానాయకుడుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు.  

  Pawan Kalyan - Bheemla Nayak Trailer Talk : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు.మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. అంతా బాగుంటే.. ఈ రోజే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగాల్సింది. అంతేకాదు  తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ (KTR) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు  ముఖ్య అతిథిగా హాజరై ఉండేవారు. కానీ అకాస్మాత్తుగా ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) అకాల మరణంతో ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వాయిదా పడింది.

  అయితే.. ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయాలనుకున్నారు. ప్రీ రిలీజ్ వేడుక రద్దయ్యైన ట్రైలర్‌ను యథావిధిగా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్‌ను ఢీ అంటే ఢీ అనే పాత్రలో డేనియర్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి పాత్ర అదిరిపోయింది.

  ఈ సినిమా ట్రైలర్.. ఏంటి బాలాజీ.. స్పీడు పెంచావు.. పులి పెగ్గేసుకొని పడుకొంది కానీ.. నువ్వు స్లోగానే పోనీ. అంటూ రానా దగ్గుబాటి వాయిస్‌తో డానీ.. డేనియల్ శేఖర్.. ‘భీమ్లా నాయక్’ ట్రైలర్  మొదలైంది. సరిహద్ భీమ్లా నాయక్.. సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్.. శ్రీశైలం తహశీల్.. హఠకేశ్వర మండలం.. ఆంధ్ర ప్రదేశ్.. డ్యూటీకి పవర్‌కు మధ్య జరిగిన క్లాషెస్‌ను ఈ సినిమాలో చూపించారు. మొత్తంగా భీమ్లా వర్సెస్ డేనియర్ శేఖర్ గా పవన్ కళ్యాణ్, రానాల మధ్య సన్నివేశాలు అదిరిపోయాయి. నేను ఇవతల ఉంటేనే చట్టం.. అవతలకు వస్తే కష్టం అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ బాగుంది. ఈ సినిమా ఇతర పాత్రల్లో మురళీ శర్మ, సముద్రఖని నటించారు.  ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ డబ్బున్న మాజీ సైనికాధికారి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ కథ. మలయాళంలో డబ్బున్న వ్యక్తిగా పృథ్విరాజ్.. పోలీస్ ఆఫీసర్‌గా బిజూ మీనన్ నటించారు. తెలుగులో ఆ పాత్రలను పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిలు నటించారు.

  ‘భీమ్లా నాయక్’గా పవన్ కళ్యాణ్ (File/Photo)

  ఇక ‘భీమ్లా నాయక్’ చిత్రానికి సెన్సార్ వాళ్లు  ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు.  ఈ సినిమా ఈ నెల 25న ఏక కాలంలో తెలుగుతో పాటు హిందీతో విడుదల కానుంది.  ఈ సినిమాను హిందీలో B4U మోషన్ పిక్చర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా అవ్వడానికి రీమేక్ అయినా కూడా అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో ముఖ్యంగా.. యూఎస్‌లో ఏకంగా 400కి పైగా థియేటర్‌లలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

  NBK 107 : బాలకృష్ణ మాస్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్.. వైరల్ అవుతున్న నట సింహా లేటెస్ట్ మూవీ పిక్స్..


  ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. సినిమా విడుదలైన 50 రోజులకు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా రూ. 109.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ. 110 కోట్ల బిజినెస్ చేయాలి. 2022లో ఈ రేంజ్‌లో ప్రీ రిలీజ్ చేసిన మొదటి చిత్రం ఇదే కావడం గమనార్హం.

  Mahesh Babu - Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ చిత్రంలో అలనాటి హీరోయిన్.. సీనియర్ హీరో సరసన..


  ‘భీమ్లా నాయక్’ సినిమాను దర్శకుడు సాగర్ కే చంద్ర  తెరకెక్కించారు. తెర వెనక త్రివిక్రమ్ అంతా చక్రం తిప్పారు. ఈ సినిమాకు అనధికార దర్శకుడిగా ఈయన పేరే వినిపిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఆయనే రాసారు.  పవన్ కళ్యాణ్, రానాలకు హీరోయిన్స్‌గా నిత్య మీనన్, (Nithya menen) సంయుక్త మీనన్ (Samyuktha Menon)‌లు నటించారు.  రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం అందించారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Saagar K Chandra, Tollywood, Trivikram Srinivas

  ఉత్తమ కథలు