హోమ్ /వార్తలు /సినిమా /

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ కోసం సరికొత్త ట్రైలర్ విడుదల..

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ కోసం సరికొత్త ట్రైలర్ విడుదల..

భీమ్లా నాయక్ (Bheemla Nayak) Photo : Twitter

భీమ్లా నాయక్ (Bheemla Nayak) Photo : Twitter

Bheemla Nayak Disney Hot Star Trailer  : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా (Rana Daggubati) హీరోలుగా నటించిన మూవీ భీమ్లా నాయక్. ఈ సినిమా ఈ నెల 25న డిస్నీ హాట్ స్టార్‌‌లో ఆహాలో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో డిస్నీ హాట్ స్టార్ ప్రత్యేకంగా ఓ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...

  Bheemla Nayak Disney Hot Star Trailer  : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా (Rana Daggubati) హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ కలెక్షన్స్ మొదటి వారం బాగానే ఉన్నా.. రెండో వారం బాక్సాఫీస్ దగ్గర సరైన రీతిలో కలెక్షన్లు కొల్లగొట్టడంలో విఫలమైంది. ఏపీలో టిక్కెట్స్ మరి తక్కువగా ఉండటం.. తెలంగాణలో చూస్తే  టికెట్స్ రేట్స్ భారీగా ఉండటం కూడా ఈ సినిమాపై కలెక్షన్స్ పై భారీగా ప్రభావం చూపించింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌కు టైమ్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను ఒకేసారి డిస్నీ హాట్ స్టార్‌తో పాటు ఆహాలో ఈ నెల 25న స్ట్రీమింగ్ కానుంది. కరోనా మూడో దశ తగ్గుతున్న వేళ విడుదలైన తొలి భారీ సినిమా ఇదే.

  బంగార్రాజు వచ్చినా.. దాని బిజినెస్ తక్కువే. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘అయ్యప్పునుమ్ కోశియుమ్’ చిత్రాన్నితెలుగులో రీమేక్ చేయడం.. ఆల్రెడీ ప్రూవ్డ్ సబ్జెక్ట్ కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. తెలుగులో పవన్ కళ్యాణ్ కోసం తెలుగులో భారీగానే మార్పులు చేసి తెరకెక్కించారు. బ్రేక్ ఈవెన్‌కు కాస్త దూరంలో ఆగిన ఈ చిత్రం అబౌ యావరేజ్‌తో సరిపెట్టుకుంది. తాజాగా ఈ సినిమా విడుదలైన సరిగ్గా 4 వారాలకు అంటే 28 రోజులకు రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫ్లామ్స్‌‌లో స్ట్రీమింగ్  కానుంది. ఈ సందర్భంగా డిస్నీ హాట్ స్టార్ ప్రత్యేక ట్రైలర్‌ను విడుదల చేశారు.

  భీమ్లా నాయక్ సినిమాను మార్చ్ 25న విడుదల చేయబోతున్నారు. ఆహా, హాట్ స్టార్ వేదికగా ఈ చిత్రం విడుదల కానుంది. అధికారికంగానూ దీనిపై ప్రకటన వచ్చింది. గతేడాది వకీల్ సాబ్ సినిమాను కూడా విడుదలైన మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసారు.. మొన్న పుష్ప సినిమా సైతం మూడు వారాలకే వచ్చేసింది. ఇప్పుడు నాలుగు వారాల్లోనే భీమ్లా నాయక్ వచ్చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. రానా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా నటించాడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. 106 కోట్ల థియెట్రికల్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్.. 97 కోట్లు వసూలు చేసింది. మరో 9 కోట్లు నష్టాల పాలయింది.

  RRR : ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ సాంగ్ మరో రికార్డు.. 100 కోట్ల క్లబ్‌లో చేరిన మాస్ సాంగ్..

  ఏపీలో టికెట్ రేట్లు పెరిగి ఉండుంటే సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధించి ఉండేదంటున్నారు ట్రేడ్ పండితులు. మరోవైపు డిజిటల్, శాటిలైట్ అన్నీ కలిపి 200 కోట్లు దాటిపోయింది ఈ సినిమా బిజినెస్.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Aha OTT Platform, Bheemla Nayak, Disney+ Hotstar, Pawan kalyan, Rana daggubati, Tollywood

  ఉత్తమ కథలు