హోమ్ /వార్తలు /సినిమా /

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ వచ్చేది ఆ రోజే.. రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన..

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ వచ్చేది ఆ రోజే.. రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన..

పెద్ద సినిమాలు అన్నీ వెనకడుగు వేస్తున్న సమయంలో ఎవరో ఒకరు ముందడుగు అయితే వేయాలి కదా.. అందుకే ధైర్యం చేస్తున్నాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఫిబ్రవరి 25నే వస్తున్నాం అని తేల్చి చెప్పేశాడు. కొన్ని ఇబ్బందులు ఉన్నా పవన్ కళ్యాణ్‌పై ఉన్న నమ్మకంతో భీమ్లా నాయక్‌ను బరిలోకి దించుతున్నాడు నాగవంశీ. మరి దీని ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

పెద్ద సినిమాలు అన్నీ వెనకడుగు వేస్తున్న సమయంలో ఎవరో ఒకరు ముందడుగు అయితే వేయాలి కదా.. అందుకే ధైర్యం చేస్తున్నాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఫిబ్రవరి 25నే వస్తున్నాం అని తేల్చి చెప్పేశాడు. కొన్ని ఇబ్బందులు ఉన్నా పవన్ కళ్యాణ్‌పై ఉన్న నమ్మకంతో భీమ్లా నాయక్‌ను బరిలోకి దించుతున్నాడు నాగవంశీ. మరి దీని ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

Pawan Kalyan - Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ  ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు.

  Pawan Kalyan - Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత  రీ ఎంట్రీ మూవీ  ’వకీల్ సాబ్’ తర్వాత పవన్ యాక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో  ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ అయింది. త్వరలోనే  ఈ చిత్రాన్ని సెన్సార్‌కు పంపనున్నారు.  ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల అవ్వాల్సి ఉండేది.

  ఆర్ఆర్ఆర్ సడెన్‌గా బరిలోకి దిగడంతో ఈ సినిమా ఫిబ్రవరి 25కి మారింది. తాజాగా పరిస్థితులు అనుకులంగా ఉంటే... ఈ చిత్రాన్ని ముందుగా చెప్పినట్టే ప్లాన్ A ప్రకారం  ఫిబ్రవరి 25నే విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. లేకపోతే.. ప్లాన్ B  ప్రకారం ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్టు రెండు డేట్స్ ప్రకటించారు.  అనుకున్నట్టే తాజాగా  ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.  తెలుగుతో పాటు హిందీలో ఏక కాలంలో ‘భీమ్లా నాయక్’ మూవీని  రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను హిందీలో B4U మోషన్ పిక్చర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు.

  ఫిబ్రవరి 25న ’భీమ్లా నాయక్’ (Twitter/Photo)

  అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎడిటింగ్‌ను దగ్గరుండి పర్యవేక్షించారట. దీంతో త్రివిక్రమ్ సూచనల మేరకు టీమ్ మరోసారి చిత్రికరించే అవకాశం ఉందట. ఇప్పటికే ఫిబ్రవరి 25న వరుణ్ తేజ్.. ‘గని’తో పాటు అజిత్ ‘వలీమై’తో పాటు శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ , స్టెబాస్టియన్ అనే సినిమాలను  అదే రోజున విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘భీమ్లా నాయక్’ ఎంట్రీతో అజిత్ ‘వలీమై’ తప్ప మిగతా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

  Balakrishna - Ram Charan : బాలయ్య బాటలో రామ్ చరణ్.. నట సింహాన్ని ఆ విధంగా ఫాలో అవుతున్న మెగా పవర్ స్టార్..

  ఇక ఆ మధ్య లాలా భీమ్లా సాంగ్ విడుదలై మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ పాటను సాంగ్‌ను తివిక్రమ్ రాసారు. త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేసారు. హీరో పవన్ పాత్ర అయిన భీమ్లా నాయక్‌ను హైలైట్ చేస్తూ సాగే ఈ పాట నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంది. కాగా ఈ పాటకు తాజాగా డీజే వర్షన్‌ను విడుదల చేసింది టీమ్. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి నాలుగు పాటల్ని వదిలారు.

  పవన్ కళ్యాణ్,రానా ‘భీమ్లా నాయక్’ హిందీ వెర్షన్‌ విడుదల చేస్తోన్న B4U (Twitter/Photo)

  ఓ డబ్బున్న మాజీ సైనికాధికారి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ కథ. మలయాళంలో డబ్బున్న వ్యక్తిగా పృథ్విరాజ్.. పోలీస్ ఆఫీసర్‌గా బిజూ మీనన్ నటించారు. అక్కడ ఈ రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఎవరూ తక్కువ కాదు.. ఎవరూ ఎక్కువ కాదు. ఇద్దరూ పర్ఫెక్టు సింకులో నటించారు. అందుకే సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. తెలుగులోకి వచ్చేసరికి ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి జాయిన్ అయ్యాడు. దాంతో సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. రానా, పవన్ అనేసరికి.. పవర్ స్టార్ ఇమేజ్ ఓ ఐదారు మెట్లు పైనే ఉంటాడు. దాంతో ఇప్పుడు ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ రీమేక్ కాస్తా పవన్ సినిమా అయిపోయింది. రానా నటిస్తున్నా కూడా దాన్ని మల్టీస్టారర్ అనట్లేదెవ్వరూ. ఎక్కువగా పవన్ సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు. బిజినెస్ కూడా పవన్ పేరు మీదే జరుగుతుంది.

  Bigg Boss Telugu OTT : బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ ప్రోమో విడుదల.. వకీల్‌సాబ్‌గా నాగార్జున లుక్ అదుర్స్..


  ఈ సినిమాలో రానా కీలక పాత్రలో నటిస్తున్నాడంటున్నారే కానీ మరో హీరోగా గుర్తించడం లేదనేది దగ్గుబాటి అభిమానుల వాదన. అందులో నిజం కూడా లేకపోలేదు. ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ అంటే అక్కడ ఇద్దరి హీరోల పేర్లు టైటిల్‌లో ఉన్నాయి. అయ్యప్పన్, కోశి ఇద్దరి మధ్య జరిగే గొడవే సినిమా కాబట్టి.. ఇద్దరి పేర్లు పెట్టారు. కానీ రీమేక్‌కు వచ్చేసరికి అది ‘భీమ్లా నాయక్’ అంటూ పవన్ సినిమా అయిపోయింది. ఈ టైటిల్ పెట్టినపుడే రానాకు అన్యాయం జరిగిందని అంతా ఫిక్సైపోయారు. ఒరిజినల్‌లో ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ అంటే అయ్యప్పన్, కోశీ.. ఇద్దరి పేర్లు ఉన్నాయి. తెలుగులో అలా కాకుండా కేవలం పవన్ పేరు పెట్టారు. దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా కూడా తెరవెనక మాత్రం అంతా త్రివిక్రమ్ చూసుకుంటున్నాడు. స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఆయనే రాసారు.

  bheemla nayak, bheemla nayak release date updates, bheemla nayak release date, bheemla nayak new release date bheemla nayak song lyrics, bheemla nayak naa songs, bheemla nayak song download, bheemla nayak budget, bheemla nayak total budget, భీమ్లా నాయక్, భీమ్లా నాయక్ రిలీజ్ డేట్,
  పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’ (File/Photo)

  ఇదిలా ఉంటే తెలుగు రీమేక్ కోసం మూడు ప్రధానమైన మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఒకటి ఎమోషనల్ సీక్వెన్స్.. ఒరిజినల్‌లో లేని కొన్ని ఎమోషనల్ సీన్స్ తెలుగులో చూడబోతున్నాం. అలాగే పవన్, నిత్యా మీనన్ మధ్య రొమాంటిక్ ట్రాక్. మలయాళంలో అలాంటిదేం ఉండదు కానీ తెలుగులో పవన్ ఫ్యాన్స్ కోసం త్రివిక్రమ్ యాడ్ చేస్తున్నాడు.  సినిమా మలయాళ వర్షన్ 2.40 గంటలకు పైగానే ఉంటుంది. అయితే తెలుగులో మాత్రం చాలా వరకు సీన్స్ కట్ చేసినట్లు తెలుస్తుంది. భీమ్లా నాయక్ కేవలం 2 గంటల 12 నిమిషాల రన్ టైమ్‌తోనే వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన చాలా వరకు సన్నివేశాలు తీసేసారన్నమాట. 2 గంటల 12 నిమిషాలు అంటే చాలా క్రిస్పీ రన్ టైమ్. మొత్తానికి త్రివిక్రమ్ చేసిన మార్పులు సినిమాకు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Saagar K Chandra, Trivikram

  ఉత్తమ కథలు