హోమ్ /వార్తలు /సినిమా /

Bheemla Nayak : ఆ ఏరియాలో పనన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ థియేట్రికల్ రన్ ముగింపు..

Bheemla Nayak : ఆ ఏరియాలో పనన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ థియేట్రికల్ రన్ ముగింపు..

సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. రానా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా నటించాడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. 106 కోట్ల థియెట్రికల్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్.. 97 కోట్లు వసూలు చేసింది. మరో 9 కోట్లు నష్టాల పాలయింది.

సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. రానా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా నటించాడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. 106 కోట్ల థియెట్రికల్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్.. 97 కోట్లు వసూలు చేసింది. మరో 9 కోట్లు నష్టాల పాలయింది.

Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. తాజాగా ‘భీమ్లా నాయక్’ థియేట్రికల్ రన్ ఆ ఏరియాలో ముగిసినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

    Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. ముందు నుంచి ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్‌లో తెలుగు సినిమాకే మేకర్స్ ఎక్కువ సమయం కేటాయించడంతో కాస్తా ఆలస్యంగా హిందీలో ఈ సినిమాను విడుదల చేయడానికి రెడీ అయ్యారు.  అదుగో రిలీజ్ అని చెప్పినా.. అక్కడ ఇప్పటికీ విడుదల చేయలేదు. పైగా రాధే శ్యామ్ వంటి ప్యాన్ ఇండియా మూవీ ఈ రోజే ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైంది.

    దీంతో ‘భీమ్లా నాయక్’ సినిమాను హిందీలో విడుదల చేయరనే విషయం స్ఫష్టమైంది. ఈ సినిమాను హిందీలో థియేట్రికల్ కాకుండా  డిజిటిల్, శాటిలైట్‌లలో  మాత్రమే  విడుదల చేస్తున్నట్టు స్పష్టమైంది.  ఫస్ట్ వీక్ తర్వాత ‘భీమ్లా నాయక్’ మూవీ కలెక్షన్స్‌లో పెద్దగ పెరుగుదల లేదు. తెలంగాణలో మాత్రం బ్రేక్ ఈవెన్‌కు కాస్త దగ్గరలోకి వచ్చింది. ఓవర్సీస్‌లో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది. మిగిలిన చాలా  ఏరియాల్లో నష్టాలు కూడా తప్పేలా కనిపించడం లేదు. మొదట్లో అదిరిపోయే వసూళ్లు వచ్చినా.. ఆ తర్వాత డ్రాప్ కనిపించింది. రెండో వీకెండ్ మీదే ఆశలు పెట్టుకున్న బయ్యర్లకు పెద్దగా కలలు నెరవేరలేదు. రీమేక్ మూవీ కావడం.. అప్పటికే చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఓటీటీ వేదికగా సబ్ టైటిల్స్‌తో ఈ సినిమాను చూడడటం వంటివి కామన్ ఆడియన్స్ ఈ సినిమా చూడటానికి పెద్దగా ఇష్టపడలేదనే విషయం స్పష్టమైంది.

    Prabhas - Radhe Shyam : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ బడ్జెట్ ఎంత.. ? లాభాల్లోకి రావాలంటే ఎంత కలెక్ట్ చేయాలి..

    ఇక ఈ సినిమా ఓవర్సీస్‌లో థియేట్రికల్ రన్ ముగిసింది. ప్రీమియర్స్ ద్వారా 1 మిలియన్‌ డాలర్‌కు కాస్త దగ్గరగా వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ ఓవరాల్‌గా 2.42 మిలియన్ డాలర్ దగ్గర ఆగిపోయింది. రాధే శ్యామ్ మూవీ విడుదల కావడంతో భీమ్లా నాయక్’ ఆడుతున్న అన్ని స్క్రీన్స్‌ నుంచి తొలిగించారు. దీంతో ‘భీమ్లా నాయక్’ థియేట్రికల్ ప్రయాణంలో ఓవర్సీస్ ప్రస్థానం ముగిసింది. రాధే శ్యామ్ మూవీ విడుదలైన..  మూడో వారంలో ఏపీ, తెలంగాణలో భీమ్లా నాయక్ మూవీ 240 థియేటర్స్‌లో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది.

    Radhe Shyam : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సహా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు చిత్రాలు..

    భీమ్లా నాయక్ సినిమాకు రూ.106.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 12 రోజుల్లో దాదాపు 95.58 కోట్ల మార్క్ అందుకుంది ఈ చిత్రం. అయితే మరో 12.42 కోట్లు వసూలు చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. వీకెండ్ క్యాష్ చేసుకోవడంలో తడబడింది భీమ్లా నాయక్. రెండో వీకెండ్ కేవలం రూ. 4.20 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఆ తర్వాత కూడా పరిస్థితులు అనుకూలించడం లేదు. పైగా ఏపీలోనూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. రాధే శ్యామ్ రాకతో ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ ప్రయాణానికి ఎండ్ కార్డ్ పడినట్టే అని చెప్పాలి.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Tollywood

    ఉత్తమ కథలు