హోమ్ /వార్తలు /సినిమా /

Bheemla Nayak New Trailer Talk : పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’ కొత్త ట్రైలర్ అదిరిందిగా..

Bheemla Nayak New Trailer Talk : పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’ కొత్త ట్రైలర్ అదిరిందిగా..

‘భీమ్లా నాయక్’ న్యూ ట్రైలర్ (Twitter/Photo)

‘భీమ్లా నాయక్’ న్యూ ట్రైలర్ (Twitter/Photo)

Pawan Kalyan - Bheemla Nayak Trailer Talk : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మరో ట్రైలర్‌ను విడుదల చేశారు.

  Pawan Kalyan - Bheemla Nayak Trailer Talk : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు.మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. తతెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ (KTR), తలసాని శ్రీనివాస్ యాదవ్  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు  ముఖ్య అతిథులుగా హాజరై యూనిట్ సభ్యులకు శాలువాలతో సత్కరించారు. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేపథ్యంలో మరో ట్రైలర్‌ను కట్ చేసి విడుదల చేసారు.

  ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్‌ను ఢీ అంటే ఢీ అనే పాత్రలో డేనియర్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి పాత్ర అదిరిపోయింది. ఎవడాడు.. పై నుంచి దిగొచ్చాడా.. అఫ్ట్రాల్ ఎస్పై... అనగానే పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదిరిపోయింది. రానా.. ఏం పీకుతావు.. ఎవరినీ అరెస్ట్ చేసావు తెలుసా.. రామ స్వామి.. వీడు బలిసి కొట్టుకుంటున్నాడు. FIR రాయి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది.

  అహంకారానికి.. ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధం అంటూ తెలుగు టైటిల్స్ ప్రదర్శించారు. ఒకపుడు ఇంగ్లీస్ డబ్బింగ్ చిత్రాలకు ఇలా మధ్యలో టైటిల్స్ వేసేవారు. మరోవైపు నాయక్ పెళ్లాం అంటే నాయక్‌లో సగం కాదు.. నాయక్‌లో డబుల్ అంటూ నిత్యా మీనన్ చెప్పే డైలాగులు బాగున్నాయి. ధూల తీస్తా నా కొడుకా.. ఒక వైల్డ్ యానిమల్‌కు కళ్లెం వేసినట్టు.. ఒక ఎక్స్‌ట్రీమ్‌కు పోలీస్ యూనిఫామ్ వేసి కంట్రోల్‌లో పెట్టాం. నువ్వు ఆ యూనిఫామ్ తీసేసావ్.. పవర్ తుపాన్ హెచ్చరిక. చిరవల్లో రానా.. నాయక్.. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

  Bheemla Nayak Pre Release Event : భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కేటీఆర్‌తో పవన్ కళ్యాణ్..


  త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు.మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. ఇప్పటికే అమెరికాలో  అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో హాఫ్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది. భీమ్లా నాయక్’ చిత్రాన్ని ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో ఏక కాలంలో విడుదల చేద్దామనుకున్నారు. కానీ తీరా హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడం.. మరోవైపు హిందీ వెర్షన్  టీజర్, ట్రైలర్ లాంటివి విడుదల చేయలేదు. అందుకే ‘భీమ్లా నాయక్’ హిందీ వెర్షన్‌ను ఒక వారం ఆలస్యంగా అక్కడ థియేటర్స్‌లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.. ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను నిరాశ పరిచే వార్త అనే చెప్పాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Tollywood

  ఉత్తమ కథలు