Bheemla Nayak Vs Daniel Sekhar : భీమ్లా నాయక్‌తో ఢీ కొట్టడానికి వస్తున్న డేనియల్ శేఖర్..

పవన్ కళ్యాణ్,రానా (Twitter/Photo)

Bheemla Nayak Vs Daniel Sekhar : భీమ్లా నాయక్‌తో ఢీ కొట్టడానికి వస్తున్న డేనియల్ శేఖర్.. ఇప్పికే భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి రానా లుక్‌ను విడుదల చేయడానికి ముహూర్తం ఖరారైంది.

  • Share this:
    Bheemla Nayak : భీమ్లా నాయక్‌తో ఢీ కొట్టడానికి వస్తున్న డేనియల్ శేఖర్.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) హీరోలుగా నటిస్తోన్న మూవీ ‘భీమ్లా నాయక్’. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ హీరోలుగా నటించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. రానా సరసన సంయుక్తా మీనన్ యాక్ట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ .. భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు.

    మరోవైపు రానా దగ్గుబాటి డేనియల్ శేఖర్ అనే మిలటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. ఈ సినిమా నుంచి డేనియల్ శేఖర్‌గా రానా లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ నెల 20న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.


    డేనియల్ శేఖర్‌గా రానా దగ్గుబాటి పాత్ర ఎలా ఉండబోతుందో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మలయాళంలో ‘డీ అంటే ఢీ అనే పాత్రలో నటించారు. తెలుగులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ఈ క్యారెక్టర్స్‌ను ఎలా చేస్తారనేది ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఒక పోలీస్ అధికారి, రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

    Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

    రానా దగ్గుబాటి సినిమాల విషయానికొస్తే.. ఈ యేడాది ‘అరణ్య’ సినిమాతో పలకరించారు. ఇక ఈయన నటించిన ‘విరాట పర్వం’ సినిమా త్వరలో విడుదల కానుంది. దాంతో పాటు బాలీవుడ్‌లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటించనున్నట్టు సమాచారం.

    NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

    పవన్ కళ్యాణ్ విషయానికొస్తే..  ‘భీమ్లా నాయక్’ సినిమాతో పాటు ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాలోను నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ యం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో అప్పీల్ కావడంతో అన్ని భాషల్లో విడుదల చేయనుంది చిత్రబృందం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: