హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan - Rana : పవన్ కళ్యాణ్ ఇమేజ్ రానాకు శాపంగా మారిందా.. ? భీమ్లా నాయక్‌లో భళ్లాలదేవుని పాత్రకు అన్యాయం..

Pawan Kalyan - Rana : పవన్ కళ్యాణ్ ఇమేజ్ రానాకు శాపంగా మారిందా.. ? భీమ్లా నాయక్‌లో భళ్లాలదేవుని పాత్రకు అన్యాయం..

పవన్ కళ్యాణ్,రానా (Twitter/Photo)

పవన్ కళ్యాణ్,రానా (Twitter/Photo)

Pawan Kalyan - Rana : పవన్ కళ్యాణ్ ఇమేజ్ రానాకు శాపంగా మారిందా.. ? భీమ్లా నాయక్‌లో భళ్లాలదేవుని పాత్రకు అన్యాయం.. జరిగిందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

  Pawan Kalyan - Rana Daggubati : పవన్ కళ్యాణ్ ఇమేజ్ రానాకు శాపంగా మారిందా.. ? భీమ్లా నాయక్‌లో భళ్లాలదేవుని పాత్రకు అన్యాయం.. జరిగిందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా త్రివిక్రమ్ మాటలు అందిస్తోన్న చిత్రానికి  యువ దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి ఎట్టకేలకు ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్, బిజూ మీనన్ చేసిన పాత్రలను తెలుగులో పవన్ కళ్యాన్, రానా చేస్తున్నారు. మలయాలంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కంటే రిటైర్డ్ మిలటరీ హవాల్దార్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కానీ తెలుగుకు వచ్చేసరికి రానా పాత్రకు ప్రాధాన్యం తగ్గించి , పనవ్ కళ్యాణ్ చేస్తోన్న పాత్రకు ప్రాధాన్యత పెరిగింది. ఒరిజినల్ వెర్షన్‌లో ఇద్దరి పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఇద్దరి మధ్య ఈగో క్లాషెసే  ఈసినిమా స్టోరీ. మలయాలంలో అది బాగా సింక్ అయింది కాబట్టి అంత పెద్ద హిట్టైయింది. తెలుగులో పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ టేకప్ చేసేసరికి అంతా మారిపోయింది.

  అంతేకాదు అక్కడ ఈ సినిమా టైటిల్‌లో  ఇద్దరి పేర్లకు ప్రాధాన్యత ఇచ్చారు.  తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ ఇమేజ్ కారణంగా రానా పాత్రకు ప్రాధాన్యత తగ్గించేసినట్టు తెలుస్తోంది. అందుకే టైటిల్‌లో కేవలం పవన్ కళ్యాణ్ పాత్ర పేరైన ‘భీమ్లా నాయక్’నే ఈ సినిమాకు టైటిల్‌గా ఫైనల్ చేశారు.

  రీసెంట్‌గా విడుదలైన టైటిల్‌తో పాటు ఫస్ట్ టీజర్‌లో రానా పాత్రకు చూపించకుండా కేవలం వినిపించారు. దీనిపై రానా అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. దీనిపై సోషల్ మీడియాలో పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.   రానా పాత్రను పవన్ కళ్యాణ్ కారణంగా అన్యాయంగా తొక్కేసారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక రకంగా చూసుకుంటే.. ‘భీమ్లా నాయక్’ సినిమాకు ఓపెనింగ్స్ గట్రా తెచ్చేది పవన్ కళ్యాణ్ ఇమేజ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే తెలుగులో రానా పాత్రకు తక్కువ చూపించి పవన్ కళ్యాణ్‌ను హైలెట్ చేసినట్టు కనిపిస్తోంది. రానా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న మాస్‌లో అనుకున్న ఇమేజ్ ఇంకా రాలేదనే చెప్పాలి. దీంతో ఆటోమేటిక్‌గా తెలుగులో రానా పాత్రకు ప్రాధాన్యం తగ్గిపోయిందనే చెప్పాలి. మొత్తంగా మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను మాత్రమే కాదు.. రానా ను దృష్టిలో పెట్టుకొని టైటిల్ పెట్టివుంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

  ఇవి కూడా చదవండి.. 

  నందమూరి నట సింహా బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

  Sarkaru Vaari Paata - Pushpa : సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మహేష్, బన్ని నిర్మాతలు..


  నాగ చైతన్య టూ సత్యదేవ్.. బాలీవుడ్‌లో బాట పడుతున్న టాలీవుడ్ హీరోలు..

  ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కు రాజమౌళి మరో బిగ్ షాక్ ఇవ్వనున్నారా.. ?

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Saagar K Chandra, Tollywood, Trivikram Srinivas

  ఉత్తమ కథలు