హోమ్ /వార్తలు /సినిమా /

Bheemla Nayak 1st Week WW Collections : పవన్ కళ్యాణ్ ’భీమ్లా నాయక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత రాబట్టాలంటే..

Bheemla Nayak 1st Week WW Collections : పవన్ కళ్యాణ్ ’భీమ్లా నాయక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత రాబట్టాలంటే..

‘భీమ్లా నాయక్’ 1st Week కలెక్షన్స్ (Twitter/Photo)

‘భీమ్లా నాయక్’ 1st Week కలెక్షన్స్ (Twitter/Photo)

Bheemla Nayak 1st WW Collections :  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  మొత్తంగా మొదటి వారం సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ వీక్‌లో బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు మాయ చేసిందో చూడండి..

ఇంకా చదవండి ...

  Bheemla Nayak 1st WW Collections :  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను ఢీ అంటే ఢీ అనే పాత్రలో డేనియర్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి పాత్ర అదిరిపోయింది. ఈ సినిమా మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్, బిజూ మీనన్ చేసిన పాత్రలను తెలుగులో పవన్ కళ్యాన్, రానా చేసారు.మలయాలంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కంటే రిటైర్డ్ మిలటరీ హవాల్దార్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కానీ తెలుగుకు వచ్చేసరికి రానా పాత్రకు ప్రాధాన్యం తగ్గించి , పవన్ కళ్యాణ్  చేసిన పాత్రకు ప్రాధాన్యత పెరిగింది. ఇక మొదటి మూడు రోజులు కలెక్షన్స్ సొంతం చేసుకున్న ‘భీమ్లా నాయక్’ నాలుగో రోజు కాస్తా డల్ అయినా.. ఐదో రోజు శివరాత్రి సందర్భంగా వసూళ్లు అదిరిపోయాయి. ఆరో రోజు  ఈ సినిమా కలెక్షన్స్‌లో భారీ డ్రాప్ కనిపించింది. ఏడోొ రోజు వసూళ్లలో మరింత డ్రాప్ కనిపించింది.

  తెలుగు రాష్ట్రాలతో ఓవర్సీస్‌లోనూ (Overseas) దుమ్ము దులిపేస్తున్నాడు పవన్ కళ్యాణ్. దానికితోడు పాజిటివ్ టాక్ కూడా రావడంతో అస్సలు తగ్గడం లేదు భీమ్లా నాయక్. మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది ఈ సినిమా. ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో కలెక్షన్స్ పై ప్రభావం చూపించాయి. ఏడు రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 0.98 కోట్లు.. ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా రూ. 0.83 కోట్లు కలుపుకుంటే.. మొత్తంగా రూ. 1.81 కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా ఏడో  రోజు ఏరియా వైజ్‌గా కలెక్షన్స్ విషయానికొస్తే..

  Chiranjeevi Old Titles : ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సహా చిరంజీవి పాత టైటిల్స్‌తో తెరకెక్కిన సినిమాలు ఇవే..

  నైజాం (తెలంగాణ): రూ. 33.33 కోట్లు / రూ. 35.00 కోట్లు

  సీడెడ్ (రాయలసీమ): రూ. 10.09 కోట్లు / రూ. 17.00 కోట్లు

  ఉత్తరాంధ్ర: రూ. 6.91 కోట్లు /  రూ.  9.50 కోట్లు

  ఈస్ట్: రూ. 5.02 కోట్లు  / రూ. 6.50 కోట్లు

  వెస్ట్: రూ. 4.63కోట్లు /  రూ. 5.60 కోట్లు

  గుంటూరు: రూ. 4.82కోట్లు / రూ. 7.20 కోట్లు

  కృష్ణా:  రూ. 3.38 కోట్లు / రూ. 6.00 కోట్లు

  నెల్లూరు: రూ. 2.33 కోట్లు / రూ . 3.20 కోట్లు

  ఏపీ + తెలంగాణ:  రూ. 70.40 కోట్లు (గ్రాస్ రూ. 106.90 కోట్లు) / రూ. 90.00 కోట్లు

  రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 7.65 కోట్లు /  రూ. 10.50 కోట్లు

  ఓవర్సీస్:రూ. 11.55 కోట్లు / రూ. 9.00 కోట్లు

  వరల్డ్ వైడ్ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్: 89.60 కోట్లు (గ్రాస్ రూ. 146 కోట్లు) / రూ. 106.75 కోట్లు.

  Prabhas - Radhe Shyam : అందువల్లే తనకు ఇంకా పెళ్లి కాలేదు.. ‘రాధే శ్యామ్’ చిత్ర ప్రమోషన్‌లో ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు..

  తెలంగాణలో రూ. 35 కోట్ల బిజినెస్ చేసింది ఈ చిత్రం. వారం రోజుల్లో రూ. 33.33 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. మరో రూ. 1.77 కోట్ల పైగా షేర్ వస్తే కానీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ కాదు.  కానీ ఏపీలో మాత్రం ఏడు రోజుల్లో రూ. 37.07 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసింది. పవన్ రేంజ్‌కు ఇది తక్కువే. కానీ అక్కడ పరిస్థితులు అలాగే ఉన్నాయి. కానీ ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది.  అక్కడ 2 మిలియన్స్  క్రాస్ చేసింది.ఈ   సినిమా ఇంకా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. 18.40 కోట్ల షేర్ రాబట్టాలి.  ఫస్ట్ వీక్‌లో 1075 స్క్రీన్స్‌లో విడుదలైన ‘భీమ్లా నాయక్’.. రెండో వారం 390 స్క్రీన్స్‌ తగ్గాయి. ఓవరాల్‌గా  తెలంగాణ (నైజాం)లో 229, రాయలసీమ (సీడెడ్) 130, ఆంధ్ర ప్రదేశ్ 325 స్క్రీన్స్‌లో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 685 స్క్రీన్స్‌లో  ప్రదర్శితమవుతోంది.  ఇక హిందీలో ఈ సినిమాను త్వరలో విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన హిందీ మూవీ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.  ఈ సినిమాఅక్కడ  ఏ మేరకు  వసూళ్లను రాబడుతుందనేది చూడాలిక.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Tollywood

  ఉత్తమ కథలు