పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా (Rana Daggubati) హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ సినిమాకు మొదట్లో అదిరిపోయే వసూళ్లు వచ్చినా.. ఆ తర్వాత డ్రాప్ కనిపించింది. రెండో వీకెండ్ మీదే ఆశలు పెట్టుకున్న బయ్యర్లకు పెద్దగా కలలు నెరవేరేలా కనిపించడం లేదు. రెండో శనివారం, ఆదివారం కలిపి కేవలం 4 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఆరు రోజుల వరకు వసూళ్లు బాగానే వచ్చినా.. ఆ తర్వాత బాగా పడిపోయాయి. సాగర్ కే చంద్ర (Saagar K Chandra) ఈ సినిమాను తెరకెక్కించాడు. త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ (Sitara Entertainments) బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఫస్ట్ వీకెండ్ వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. తొలి మూడు రోజుల్లో అదిరిపోయే కలెక్షన్స్ తీసుకొచ్చిన భీమ్లా.. నాలుగో రోజు నుంచి తగ్గిపోయాడు. ఏపీ, తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీగా పడిపోయాయి వసూళ్లు. రెండో ఆదివారం సినిమాకు కేవలం 2.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. సినిమా 10 రోజుల్లో 150 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా 13.34 కోట్ల దూరంలో ఉంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. మరి భీమ్లా నాయక్‌కు 10 రోజుల్లో వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..
నైజాం: 34.42 కోట్లు
సీడెడ్: 10.84 కోట్లు
ఉత్తరాంధ్ర: 7.38 కోట్లు
ఈస్ట్: 5.34 కోట్లు
వెస్ట్: 4.88 కోట్లు
గుంటూరు: 5.10 కోట్లు
కృష్ణా: 3.67 కోట్లు
నెల్లూరు: 2.48 కోట్లు
ఏపీ, తెలంగాణ 10 డేస్ కలెక్షన్స్: 74.11 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 8.15 కోట్లు
ఓవర్సీస్: 12.40 కోట్లు
వరల్డ్ వైడ్ 10 డేస్ కలెక్షన్స్: 94.66 కోట్లు (154 కోట్లు గ్రాస్)
భీమ్లా నాయక్ సినిమాకు రూ.106.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 10 రోజుల్లో దాదాపు 95 కోట్ల మార్క్ అందుకుంది ఈ చిత్రం. అయితే మరో 13 కోట్లు వసూలు చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. వీకెండ్ క్యాష్ చేసుకోవడంలో తడబడింది భీమ్లా నాయక్. రెండో వీకెండ్ కేవలం 4 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. పైగా ఏపీలోనూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. మొత్తానికి చూడాలిక.. భీమ్లా నాయక్ ప్రయాణం ఎంతవరకు ఉండబోతుందో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.