హోమ్ /వార్తలు /సినిమా /

Bharath Trailer Talk: దేశం కోసం ఒక వ్యక్తి ప్రయాణమే ‘భారత్’..

Bharath Trailer Talk: దేశం కోసం ఒక వ్యక్తి ప్రయాణమే ‘భారత్’..

‘భారత్’ మూవీ పోస్టర్

‘భారత్’ మూవీ పోస్టర్

ఈ యేడాది బాలీవుడ్‌లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన ‘భారత్’ మూవీ ఒకటి. ‘సుల్తాన్’,‘టైగర్ జిందా హై’ సినిమాల తర్వాత దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ డైరెక్షన్‌లో సల్మాన్ యాక్ట్ చేసిన సినిమా కావడంతో  ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో ట్రైలర్‌ను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...

ఈ యేడాది బాలీవుడ్‌లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన ‘భారత్’ మూవీ ఒకటి. ‘సుల్తాన్’,‘టైగర్ జిందా హై’ సినిమాల తర్వాత దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ డైరెక్షన్‌లో సల్మాన్ యాక్ట్ చేసిన సినిమా కావడంతో  ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ తన ఫిల్మ్ కెరీర్‌లో చేయనటువంటి పాత్రను ఈ సినిమాలో చేసాడు. ఈ సినిమాను కొరియాలో హిట్టైన ‘ ఓడ్ టూ మై ఫాదర్’ మూవీకి మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేసారు. జూన్ 5న ఈద్ కానుకగా ఈ సినిమాను  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రోజుకే పోస్టర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచిన మూవీ మేకర్స్ తాజాగా ఈ  సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్‌ను రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ ‌లో సల్మాన్ ఖాన్..ముసలివాడిగా చూపిస్తూ..మన దేశంలో సామాన్య ముసలివాడి జీవితంలో ఏముంటాయి అనుకుంటున్నారు కదా. కానీ నా తలపై ఎన్ని తెల్ల వెంట్రుకలు ఉన్నాయో ..తన జీవితంలో అన్ని మలుపులున్నాయని చెబుతుంటాడు.కట్ చేస్తే సర్కస్‌లో బైక్ స్టంట్స్ చేసే వ్యక్తి పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపిస్తాడు. ఆ తర్వాత భారత ప్రథమ ప్రధాని నెహ్రూ చనిపోయిన దృష్యాలను చూపించారు. ఒక ఉద్యోగం కొరకై హీరో ఇంటర్వ్యూకు వెళతాడు. అక్కడ కత్రినా ఒక ప్రభుత్వాధికారిగా పనిచేస్తుంటుంది. అక్కడ మీ పేరేంటి అని అడిగిపుడు హీరో ‘భారత్’ అని చెబుతాడు. అది విని కత్రినా షాక్ అవుతుంది. దేశంపై ఉన్న ప్రేమతో మా నాన్న నాకు ఎలాంటి ఇంటి పేరు లేకుండా ‘భారత్’ పేరు పెట్టినట్టు చెబుతాడు. సర్ నేమ్ పెట్టుకుంటే దేశాన్ని అవమానించినట్టు అవుతుందని మా నాన్న ఎలాంటి సర్‌నేమ్ ఇవ్వలేదు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్.. సర్కస్‌లో ఫీట్స్ చేసే వ్యక్తిగా కాకుండా..గని కార్మికుడిగా,నేవీ అధికారిగా, మిడిల్ ఏజ్ వ్యక్తిగా, వృద్దుడిగా ఐదు పాత్రల్లో కనిపించనున్నాడు. ఒక దేశం వ్యక్తులతో తయారు అవుతుంది. వ్యక్తల పరిచయం వాళ్ల కుటుంబాలతో ఏర్పడుతుంది అని చెప్పే డైలాగ్ బాగుంది. ట్రైలర్ క్లైమాక్స్‌లో సల్మాన్..భారత్, పాక్ అట్టారీ సరిహద్దు నిల్చొని ఉండే సీన్ బాగుంది. ఒక వ్యక్తి దేశం కోసం చేసే ప్రయాణమే ‘భారత్’ మూవీ.


Bharat Trailer: Salman Khan Exhilarates As the Grand Old Saviour of the Nation,salman khan,bharat salman khan,salman khan twitter,salman khan instagram,bharat movie trailer,bharat trailer,salman khan bharat,salman khan films,bharat trailer reaction,salman khan new movie,bharat trailer review,salman khan latest movie,bharat teaser,bharat,bharat movie,bharat movie salman khan,salman khan bharat movie trailer,salman khan movie 2019,bharat salman khan trailer,bharat official trailer,bharat movie teaser,salman khan movie,jabardasth,bollywood,hindi cinema,,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ భారత్ ట్రైలర్,భారత్ మూవీ ట్రైలర్ టాక్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ ఫస్ట్ లుక్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీ అప్డేడ్స్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ దిశా పటానీ టబు,సల్మాన్ ఖాన్ భారత్ అలీ అబ్బాస్ జఫర్,
‘భారత్’లో సల్మాన్ ఖాన్


కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో దిశా పటానీ, టబు  ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేసారు.  ఈ సినిమాను భారతదేశాని బ్రిటిష్ వారు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనల సమాహారంగా తెరకెక్కించినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఐదు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించున్నాడు.  యువకుడిగా, గని కార్మికుడిగా,నేవీ అధికారిగా, వృద్ధుడిగా వివిధ పాత్రల్లో సల్మాన్ తన నటనతో అభిమానులకు కనువిందు చేయనున్నాడు.

First published:

Tags: Ali Abbas Zafar, Bharath, Bharath Movie Review, Disha Patani, Katrina Kaif, Salman khan, Tabu

ఉత్తమ కథలు