BHANU CHANDER REVEALS THE REASON BEHIND TO BUY TRISHA HOUSE MNJ
Bhanu Chander: త్రిష ఇల్లును అందుకే కొన్నా.. అసలు విషయం చెప్పిన భాను చందర్
భాను చందర్ త్రిష
తన నటనతో ఇటు తెలుగు, అటు తమిళంలో క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో భాను చందర్(Bhanu Chander) ఒకరు. ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు(Master Venu) కుమారుడైన భాను చందర్.. మనవూరి పాండవులు(Manavuri Pandavulu) ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు
Bhanu Chander: తన నటనతో ఇటు తెలుగు, అటు తమిళంలో క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో భాను చందర్ ఒకరు. ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడైన భాను చందర్.. మనవూరి పాండవులు ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. కె.విశ్వనాథ్, బాలు మహేంద్ర, బాలచందర్ వంటి లెజండరీ దర్శకుల దర్శకత్వంలో నటించిన భాను చందర్.. ఒకప్పుడు అమ్మాయిల లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. డ్రగ్స్ కి బాగా బానిసగా మారిన భాను చందర్.. దాన్ని నుంచి బయట పడటం కోసం మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకున్నారు. ప్రస్తుతం ఇటు తెలుగు, అటు తమిళ్ లో పలు చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఓ కీలక విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. నటి త్రిష ఇల్లును తాను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.
అప్పట్లో త్రిష ఇంకా గుర్తింపు పొందిన హీరోయిన్ అవ్వలేదు. చిన్న చిన్న పాత్రలు చేసేది. కొన్ని కారణాల వలన త్రిష తండ్రి ఆ ఇంటిని అమ్మాల్సి వచ్చింది. దాన్ని నేను కొన్నాను. ఆ ఇల్లు నాకు బాగా కలిసి వచ్చింది. సురేష్ బాబు కుమార్తె పెళ్లి సమయంలో త్రిష నా దగ్గరకు వచ్చి సర్ ఇల్లు ఎలా ఉంది అని అడిగింది. నేను ఒకసారి రావొచ్చా సర్ అని అడిగింది. నువ్వు ఎప్పుడైనా రావొచ్చు. మీ అంత బాగా ఇంటిని మేనేజ్ చేస్తున్నానో లేదో తెలీదు కానీ.. నీకు ఎప్పుడైనా స్వాగతం అని చెప్పా. సర్ అందులో నా బెడ్ రూమ్ అంటే నాకు చాలా ఇష్టం సర్. దాన్ని చూడటానికి ఎప్పుడైనా వస్తాను అని చెప్పింది. అయితే తన బిజీ బిజీ షెడ్యూల్ లతో త్రిష ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. కానీ ఆ ఇల్లు మాత్రం నాకు బాగా కలిసొచ్చింది అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు భాను చందర్.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.