హోమ్ /వార్తలు /సినిమా /

క్షమించండి.. అనుచిత వ్యాఖ్యలపై దర్శకుడు భాగ్యరాజా..

క్షమించండి.. అనుచిత వ్యాఖ్యలపై దర్శకుడు భాగ్యరాజా..

Twitter

Twitter

దర్శకుడు భాగ్యరాజా విభిన్న కథా చిత్రాల నటుడిగా, దర్శకుడిగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఆ మధ్య ఓ సినిమా వేడుకలో మహిళలపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి.

  దర్శకుడు భాగ్యరాజా విభిన్న కథా చిత్రాల నటుడిగా, దర్శకుడిగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఆ మధ్య ఓ సినిమా వేడుకలో మహిళలపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. తమిళ సినిమా ‘కరుత్తుగులై పుదిఉసెయ్’ ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న ఆయన  ఆడవాళ్ల ప్రవర్తన పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా సెల్ ఫోన్స్ కారణంగా ఆడవాళ్లు చెడిపోతున్నారని.. అంతేకాదు వివాహేతర సంబంధం కోసం భర్త, పిల్లల్ని ఒదిలేస్తున్నారన్నారని  మహిళల అజాగ్రత్త వల్లే రేపులు జరగుతున్నాయన్నారు. రీసెంట్‌గా పొలాచ్చిలో జరిగిన రేప్‌ ఘటనలో మగవాళ్లది అసలు తప్పే లేదన్నారు. అక్కడ అమ్మాయి అవకాశం ఇచ్చింది కాబట్టి రేప్ జరిగిందన్నారు. మరోవైపు ఇపుడున్న ఆడవాళ్లు చాలా మంది కట్టుబాట్టను ఒదిలేస్తున్నారన్నాని చెప్పారు. అలాంటి వాళ్ల వల్లే ఇన్ని అనర్థాలు వచ్చిపడ్డాయన్నారు. ఇంకోవైపు  ఆడవాళ్లు కట్టుబాట్ల గురించి మాట్లాడిన భాగ్యరాజా పురుషులు ఎన్ని సంబంధాలు పెట్టుకున్న ఏమి కాదంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఈయన వ్యాఖ్యలు తమిళనాడు వ్యాప్తంగా మహిళ సంఘాలు భాగ్యరాజా తీరుపై మండిపడ్డాయి. ఆయన వెంటనే మహిళ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.

  ఈ వివాదంపై స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ డిసెంబర్ 2 న కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ.. ఆ వ్యాఖ్యలపై భాగ్య రాజాను వివరణ కోరింది. అయితే ఆయన డిసెంబర్ 2 న హాజరు కాలేకపోవడంతో ఈ రోజు హాజరైయారు. కమిషన్ ముందు హాజరు తరువాత ఆయన పాత్రికేయులతో సమావేశమై, “పొల్లాచి సంఘటనలో జాగ్రత్తగా ఉండమని మహిళలకు చెప్పాను. కానీ నా అభిప్రాయాన్ని వక్రీకరించారని కమిషన్‌కు చెప్పానన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. నేను మాట్లాడిన మాటలకు ఎవరైనా బాధపడితే నన్ను క్షమించండి. ” అంటూ మీడియా ముందు వివరణ ఇచ్చుకున్నారు.

  హాట్ ఫోటో షూట్‌లతో కేక పెట్టిస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ...

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Tamil Film News

  ఉత్తమ కథలు