Yearender 2020: Best Web series .. ఈ ఏడాదిలోగా Prime, Disney, Vootలో చూసేయండి

ఓటీటీలో బాలీవుడ్ స్టార్స్ Photo : Twitter

ఎంపిక చేసిన వెబ్ సిరీస్ (web series) మీకు మంచి వినోదాన్ని ఇస్తుంది. ఇలాంటివి మీకు నచ్చినప్పుడు ఎన్నిసార్లైనా స్ట్రీమ్ చేసుకుని చూడవచ్చు కనుక, తీరిక దొరికినప్పుడు అలా వీటిని చూసి ఎంజాయ్ చేయండి.

  • Share this:
కోవిడ్-19 (covid-19) కారణంగా ఎలాగూ థియేటర్లో పెద్దగా కొత్త సినిమాలేం లేవు. మరోవైపు ఇయర్ ఎండర్ కావటంతో బోలెడు సెలవులు మిగిలిపోయి ఉంటాయి. ఇంకా లాంగ్ వీకెండ్లు ఎలాగూ ఉన్నాయి. ఇంట్లో ఉండి బింజ్ వాచ్ చేయాలనుకుంటే బెస్ట్ ఎంటర్ టైన్మెంట్ కోసం వెబ్ సిరీస్ (web series) ను ట్రై చేయవచ్చు. మరెందుకు ఆలస్యం అత్యధికులు మెచ్చిన, విమర్శకుల ప్రశంసలు అందుకున్న అలాంటి 10 బెస్ట్ వెబ్ సిరీస్ (web series) ను మీరు ఎంజాయ్ చేయండి.. ఆ లిస్ట్ మీకోసం..

1. Mirzapur 2-Amazon Prime Video

"మీర్జాపూర్" (Mirzapur) తొలి సిరీస్ ప్రేక్షకులకు మంచి వినోదం పంచింది. దీంతో 2 ఏళ్ల తరువాత వచ్చిన "మీర్జాపూర్ 2” (Mirzapur) ఇప్పుడు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. అత్యధికులు చూసి, బాగుందన్న "మీర్జాపూర్" (Mirzapur) వెబ్ సిరీస్ (web series) లో మున్నా భాయ్, బీనా త్రిపాఠి, గుడ్డు పండిట్, గోలు వంటి వారు మిమ్మల్ని అలరిస్తారు. కొత్త సీజన్ లో Divyendu Sharmaa దివ్యేందు శర్మా వంటి వారు తమ నటనా కౌశలంతో ఆకట్టుకోవటం ఖాయం.

2. Paatal Lok-Amazon Prime video

"పాతాల్ లోక్" (Paatal Lok) రిలీజ్ అయిన తొలి వారంలోనే సెన్సేషన్ సృష్టించిన వెబ్ సిరీస్ (web series) గా ఈ క్రైమ్ వెబ్ సిరీస్ (web series) అదరగొట్టింది. "పాతాల్ లోక్" (Paatal Lok) తరువాత ఇదే కోవలో బోలెడన్ని క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చినప్పటికీ పాతాల్ లోక్ (Paatal Lok) మాత్రం బెంచ్ మార్క్ లా నిలిచిపోయింది. నిజానికి 2020 బెస్ట్ క్రైమ్ షోగా చోటు సంపాదించుకుంది. మీరింకా "పాతాల్ లోక్" (Paatal Lok) చూడకపోతే డిసెంబర్ లాంగ్ వీకెండ్లో బింజ్ వాచ్ చేస్తూ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఒక ఎపిసోడ్ చూస్తే మరో ఎపిసోడ్ కు గ్యాప్ ఇవ్వాలనిపించదు కనుక సిరీస్ అయిపోయే వరకూ మీరు చూస్తూనే ఉంటారు. real game-changers of 2020 విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది కూడా.

3. Scam 1992: The Harshad Mehta Story Sony LIV

మీరింకా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కు సంబంధించిన వెబ్ సిరీస్ చూడలేదంటే ఇదే రైట్ టైం. IMBd ఏకంగా దీనికి 9.5 రేటింగ్ ఇచ్చిందంటే ఈ వెబ్ సిరీస్ ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. ఈ బయోగ్రాఫికల్ జర్నీలో వివాదాస్పదScam 1992: The Harshad Mehta Story స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహ్తా చేసిన కుంభకోణాన్ని కళ్లకు కట్టినట్టు చూపారు. ఈ వెబ్ సిరీస్ (web series) చాలా పాప్యులర్ అయిన left shows like Breaking Bad and Chernobyl వంటి షోలను కూడా పక్కకు నెట్టిందంటే అతిశయోక్తి కాదు.

4. AARYA-Disney+Hotstar

సుష్మితా సేన్ ప్రధాన పాత్రలో నటించిన "ఆర్యా" (Aarya) లో యాక్షన్ ప్యాక్డ్ డ్రామా చాలా ఆసక్తిగా ఉంది. 2020లో అత్యధికంగా ట్వీట్ అయిన వెబ్ సిరీస్ (web series) గా కూడా "ఆర్యా" చరిత్ర సృష్టించింది. డచ్ సిరీస్ Penoza ప్రేరణతో రూపొందిన ఆర్యా (Aarya) లో సుష్మితా నటన హైలైట్.

5. Asur-Voot

వూట్ (voot) లో స్ట్రీమ్ అవుతున్న "అసుర్" వారణాసి నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ (web series) . ఇండియన్ మైథాలజీతో ఫోరెన్సిక్ సైన్సును ముడిపెడుతూ తీసిన వెబ్ సిరీస్ (web series) గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా భలే ఆకట్టుకుంటుంది. అర్షద్ వార్సి, బరున్ సోబ్టి లీడ్ రోల్స్ పోషించారు.

6. Panchayat-Amazon Prime Video

నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ నటించిన "పంచాయత్" అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో దుమ్ములేపుతోంది. నిజానికి "పంచాయత్" రిలీజ్ కాకముందు వరకు బింజ్ వాచింగ్ పెద్దగా అలవాటులేనివారు సైతం "పంచాయత్" రిలీజ్ తో సడన్ గా తమ అలవాట్లు మార్చుకుని బింజ్ వాచింగ్ మొదలుపెట్టారు. అంటే "పంచాయత్" లో ఉన్న ఎంటర్ టైన్మెంట్ ఆ రేంజ్ లో ఉందన్నమాట. పల్లెటూరి కథనం, గ్రామీణ నేపథ్యంలో మాత్రమే సాగినప్పటికీ చాలా సహజంగా ఈ సిరీస్ ఉండటం ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.

7. Special ops-Dosney+Hotstar

యాక్షన్ థ్రిల్లర్ "స్పెషల్ ఆప్స్" ను ఇండియన్ ఇంటెలిజెన్స్ లో జరిగిన యదార్థ గాథల ఆధారంగా నీరజ్ పాండే తెరకెక్కించారు. కేకే మేనన్, దివ్యా దత్తా, వినయ్ పాఠక్ వంటివారు తమ టాలెంట్ తో ఈ వెబ్ సిరీస్ (web series) లో ఇరదీశారు.

8. Aashram-MX Player

2020లో ఇంప్రెస్సివ్ కం బ్యాక్ చేసిన బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ షో "ఆశ్రమ్" ప్రస్తుతం ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీం అవుతోంది. తమను తాబు దేవుళ్లని చెప్పుకునే బాబాలు, వారి ఆశ్రమాల్లో జరిగే తతంగాల గుట్టు విప్పే క్రైమ్ థ్రిల్లర్ గా ఇది ఆకట్టుకుంటుంది.

9. Breathe: Into the Shadows- Amazon Prime video

హిట్ వెబ్ సిరీస్ (web series) "బ్రీత్" కు సీక్వెల్ గా రిలీజ్ అయిన "బ్రీత్ ఇంటు ద షాడో"లో అభిషేక్ బచ్చన్, నిత్యామీనన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సైకియాట్రిస్ట్ చుట్టూ తిరిగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చివరి వరకూ ఆకట్టుకుంటుంది.

10.Bandish Bandits-Amazon Prime Video

ఇండియన్ క్లాసికల్ సింగర్, పాప్ స్టార్ మధ్య జరిగే ప్రేమాయణాన్ని, మ్యూజికల్ జర్నీగా చూపుతూ, ఈమధ్య తలెత్తే వివాదాలను చూపిన వెబ్ సిరీస్ (web series) గా ఈ ఏడాది అందరి మన్ననలు సంపాదించుకుంది. నసీరుద్దీన్ షా మొదటిసారి వెబ్ సిరీస్ లో నటించడంతో దీనికి మంచి హైప్ వచ్చింది. శంకర్-ఎహసాన్-లాయ్ ల మ్యూజిక్ ఈ వెబ్ సిరీస్ (web series) మీకు చాలా నచ్చుతుంది.

వెబ్ సిరీస్ (web series) అంటే కేవలం చవకబారు సరుకని, సెక్స్, క్రైమ్ మించి ఇంకే వినోదం ఉండదని భావించేవారు అత్యధికులు. కానీ కొన్ని ఎంపిక చేసిన వెబ్ సిరీస్ (web series) మీకు మంచి వినోదాన్ని ఇస్తుంది. ఇలాంటివి మీకు నచ్చినప్పుడు ఎన్నిసార్లైనా స్ట్రీమ్ చేసుకుని చూడవచ్చు కనుక, తీరిక దొరికినప్పుడు అలా వీటిని చూసి ఎంజాయ్ చేయండి. బాలీవుడ్ ప్రముఖ నటులు కూడా వెబ్ సిరీస్ (web series) ల్లో నటిస్తుండగా, సినిమాకు ధీటుగా ఈ వెబ్ సిరీస్ (web series) రూపొందుతున్నాయి. ప్యారలెల్ సినిమాలుగా ఫ్యాన్స్ వీటిని భావిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published: