హోమ్ /వార్తలు /సినిమా /

Drug Case : హీరోయిన్ ఇంట్లో గంజాయి... నేడు ఈడీ ముందుకు పూరీ జగన్నాథ్..

Drug Case : హీరోయిన్ ఇంట్లో గంజాయి... నేడు ఈడీ ముందుకు పూరీ జగన్నాథ్..

ప్రతీకాత్మక చిత్రం Photo : Twitter

ప్రతీకాత్మక చిత్రం Photo : Twitter

Drug Case : హీరోయిన్ ఇంట్లో గంజాయి దొరికింది. నటి, మోడల్ సోనియా అగర్వాల్ ఇంట్లో సోమవారం పోలీసులు సోదాలు నిర్వహించగా 40 గ్రాముల గంజాయి దొరికింది.

నటి, మోడల్ సోనియా అగర్వాల్ ఇంట్లో సోమవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు నటి సోనియా అగర్వాల్ ఇంట్లో 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సోదాలు నిర్హహించే సమయంలో హీరోయిన్ ఇంట్లో లేదు. మాదకద్రవ్యాల విక్రయదారులలో ఒకరు ఆమె గురించి వివరాలను అందించడంతో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కర్ణాటక పోలీసులు చాలా మంది ప్రముఖులను తమ స్కానర్ కింద ఉంచారు. ఈ కేసులో డీజే వచన్ చినప్పను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఇటీవల, మాదకద్రవ్యాల విక్రయానికి సంబంధించి నైజీరియా దేశస్థుడు థామస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ .15.50 లక్షల విలువైన ఎక్టసీ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా థామస్‌ తన రెగ్యులర్ కస్టమర్స్ అయిన కాలేజీ విద్యార్థులు, టెక్కీలు, సెలెబ్రిటీల జాబితాను పోలీసులకు అందచేశారని సమాచారం. థామస్.. ప్రతి డ్రగ్ పిల్ రూ .3000 కి అమ్మేవారట. కొకైన్‌ను గ్రాముకు 15,000 కి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు.

ఇక గతంలో ఇదే డ్రగ్ కేసులో పోలీసులు.. శాండిల్‌వుడ్ నటులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిని అరెస్టు చేసిన సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే బెంగళూరులోని నటులు, ప్రముఖులలో మాదకద్రవ్యాల వినియోగం ప్రబలంగా ఉందని పేర్కొంటూ పోలీసులు ఒక నివేదికను సమర్పించారు.

ఇక మరోవైపు ఇక్కడ టాలీవుడ్‌లో కూడా మరోసారి డ్రగ్ కేసును తిరగదోలుతున్నారు అధికారులు. దీంతో మరోసారి టాలీవుడ్‌లో డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఈడీ ఎంట్రీతో టాలీవుడ్‌ షేక్ అవుతోంది. డ్రగ్స్ కేసులో ఈరోజు నుంచి ఈడీ విచారణ మొదలు కానుంది. అందులో భాగంగా ఇప్పటికే ముగ్గురు నిందితుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేసిన ఈడీ.. ఈ క్రమంలో 12 మంది టాలీవుడ్ నటీనటులకు నోటీసులు జారీ చేసింది. విచారణలో భాగంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ ఈరోజు ఈడీ ముందు హాజరు కానున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 2న నిర్మాత చార్మీ, సెప్టెంబర్‌ 6న నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈడీ ముందు హాజరు కానున్నారు. సెప్టెంబర్‌ 8న నటుడు రానా దగ్గుబాటి, సెప్టెంబర్‌ 9న రవితేజ, అతని డ్రైవర్‌ శ్రీనివాస్‌ విచారణకు హాజరు కావాల్సి ఉంది. సెప్టెంబర్‌ 13న నటుడు నవదీప్‌, ఎఫ్‌ క్లబ్‌ జనరల్‌ మేనేజ‌ర్‌‌తో కలిసి ఈడీ ముందు హాజరుకానున్నారు. ఇక సెప్టెంబర్‌ 15న ముమైత్ ఖాన్‌, సెప్టెంబర్‌ 17న తనీష్‌, సెప్టెంబర్‌ 20న నందు, సెప్టెంబర్‌ 22న తరుణ్‌ను ప్రశ్నంచనుంది ఈడీ.

First published:

Tags: Drug case, Tollywood news

ఉత్తమ కథలు