BENGALI TV ACTRESS PALLAVI DEY FOUND DEAD AT HER HOME IN KOLKATA LIVE IN PARTNER BEING QUESTIONED TA
Pallavi Dey : పాపులర్ సీరియల్ నటి అనుమానాస్పద మృతి.. ఇంట్లో శవమైన బ్యూటీ ..
పాపులర్ సీరియల్ నటి అనుమానాస్పద మృతి (Twitter/Photo)
Pallavi Dey : కోల్‌కతాలో ఒక వర్ధమాన బెంగాలీ యాక్ట్రెస్ పల్లవి డే ఇంట్లో అనుమానస్పద రీతిలో శవమై కనిపించడం బెంగాలీ టీవీ మరియు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది.
Pallavi Dey : రీసెంట్గా ఓ రియాలిటీ డాన్స్ షో విన్నర్‌గా నిలిచి.. ఆ తర్వాత అదే ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యహరించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ టీనా సాధు అనుమానస్పద మృతి నుంచి తేరుకోకముందే.. కోల్‌కతాలో ఒక వర్ధమాన బెంగాలీ యాక్ట్రెస్ పల్లవి డే ఇంట్లో అనుమానస్పద రీతిలో శవమై కనిపించడం బెంగాలీ టీవీ మరియు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఈమె అక్కడ ‘అమీ సిరాజెర్ బేగమ్, రేషమ్ జాపీ, కుంజోచయా వంటి పాపలర్స్ సీరియల్స్‌తో అక్కడ ప్రేక్షకులకు చేరువైంది. ఈమె ఆదివారం ఇంట్లో విగత జీవిగా కనిపించింది. దీంతో పోలీసుల వచ్చి ఈమెను హుటాహుటినా సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె చనిపోయి చాలా టైమ్ అయిందని డాక్టర్లు తెలియజేసారు. పల్లవి డే మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరాలు తీస్తున్నారు. ఈమె ప్రముఖ బెంగాలీ టీవీ షో ‘మన్ మనే నా’తో పాపులర్ అయింది.
డాక్టర్లు ఈమె బాడీని పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. పోస్ట్ మార్టమ్ నివేదిక పై పోలీసులు ఈమె మృతిపై దర్యాప్తు మొదలు పెట్టారు. ఈమె ఏదో డిప్రెషన్‌కు లోను కావడం వల్లనే సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు తెలుస్తోంది. పల్లవి డే మృతిపై ఆమె సహ నటులతో పాటు ఆమె అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న నటి ఇలా హఠాత్తుగా శవమై కనిపించడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈమె విగత జీవిగా పడివున్న అపార్ట్మెంట్ సౌత్ కోల్‌కతాలో ఉంది. అక్కడ ఈమె గత ఏప్రిల్ 24 నుంచి ఉంటోందని చెబుతున్నారు. పల్లవితో పాటు ఈ అపార్ట్మెంట్లోసాగ్నిక్ చక్రబర్తి అనే వ్యక్తి ఈమెతో పాటు సహ జీవనం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
త్వరలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి రావడంతో వీళ్లిద్దరు గత కొన్నేళ్లుగా సహ జీవనం చేస్తున్నారట. మరోవైపు పల్లవి అనుమానాస్పద మృతిపై ఆమెతో సహ జీవనం చేస్తోన్న సాగ్నిక్ చక్రబర్తి అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న నటి హఠాత్తుగా కాలం చేయడంతో ఆమెతో సీరియల్స్ తీస్తున్న నిర్మాతలు, దర్శకులు, అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.