BENGALI ACTRESS PRATYUSHA PAUL RECEIVES RAPE THREATS FROM AN ANONYMOUS USER ON INSTAGRAM AND SHE FILES COMPLAINT SRD
Pratyusha Paul : నటికి అత్యాచార బెదిరింపులు..అశ్లీల ఫోటోల్ని ఆమె తల్లి, చెల్లికి పంపుతూ..
Photo Credit : Instagram
Pratyusha Paul : ఈ రోజుల్లో ఆకతాయిల అగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వెదవలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల్ని కూడా వదలడం లేదు కొందరు దుర్మార్గులు.
ఈ రోజుల్లో ఆకతాయిల అగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వెదవలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల్ని కూడా వదలడం లేదు కొందరు దుర్మార్గులు. లేటెస్ట్ గా బెంగాలీ టీవీ నటి ప్రత్యూష పాల్ అత్యాచార బెదిరింపులు ఎదుర్కోన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేయటం మొదలెట్టారు. దీంతో ఆమె కొల్కతా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన కామెంట్లతో గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు ఆమె విలేకరులకు తెలిపారు. గతేడాది కాలంగా ఈ పోస్టులు వస్తున్నాయని… మొదట్లో వీటిని చూసి చూడనట్టు వదిలేసినా రాన్రాను వారి ఆగడాలు పెచ్చు మీరుతుండటంతో సోషల్ మీడియాలో అతని అకౌంట్ బ్లాక్ చేసినట్లు ఆమె వివరించారు.ఒక అకౌంట్ బ్లాక్ చేసినా మరోక కొత్త అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా అశ్లీల ఫోటోలు పంపుతూ అత్యాచారం చేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలను తన తల్లికి, చెల్లికి కూడా పంపించి మానసిక వేదనకు గురి చేశారని ఆమె వాపోయారు. గతేడాది కాలంలో అసభ్య, అశ్లీల మెసేజ్లు, ఫోటోలు వచ్చే 30 అకౌంట్లను బ్లాక్ చేసినట్లు నటి చెప్పారు.
బ్లాక్ చేసిన ప్రతి సారి మరోక కొత్త అకౌంట్ నుంచి ఫోటోలు పంపించటం మొదలెట్టటంతో విసిగిపోయి ఆమె తన తల్లితో కలిసి కోల్కతాలోని సైబర్ క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 66సి/67/ఎ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఆర్ డబ్ల్యూ సెక్షన్ 3545 ఏ/354డి./506/509కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రత్యూష పాల్ ప్రముఖ టెలివిజన్ నటి. టోబు మోనో రేఖో, మల్భాక్లర్ కథ వంటి సీరియల్స్ లో నటించి పేరు ప్రఖ్యాతులు గడించారు. ఈ బుల్లి తెర నటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈమెకు దాదాపు నాలుగు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో.. ఆకతాయిలు ఆమె సోషల్ మీడియా ఆకౌంట్లని టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని..ప్రత్యూష పాల్ కి హామీ ఇచ్చారు పోలీసులు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.