యువ కథానాయకుల్లో బాలీవుడ్ వైపు వాంటెడ్‌గా అడుగులేస్తున్న వారిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకడు. తెలుగులో రాక్షసుడు మినహా ఈ హీరోకు చెప్పుకోదగ్గ హిట్ లేదు. అయితే తండ్రి.. నిర్మాత బెల్లంకొండ సురేష్ అండ దండలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వచ్చాడు. సినిమాలు ప్లాపైనా ఈ హీరో సినిమాలకు యూ ట్యూబ్‌లో మిలియన్ సంఖ్యలో వ్యూస్ రావడంతో హిందీలో హిందీ అనువాద మార్కెట్ క్రియేట్ అయ్యింది బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి. అదే తన క్రేజ్ అనుకున్నాడేమో.. ఏకంగా బాలీవుడ్‌లో అడుగులేశాడు. తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఛత్రపతి రీమేక్ హక్కులను దక్కించుకుని బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి రెడీ అయిపోయాడు.
తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌ను పరిచయం చేసిన డైరెక్టర్ వి.వి.వినాయకే బాలీవుడ్ ఛత్రపతిని రీమేక్ చేస్తుండటం విశేషం. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వ్యవహారంపై యూనిట్‌ను ఇబ్బంది పెట్టిన సమస్య.. హీరోయిన్. బెల్లంకొండ శ్రీనివాస్ అంటే బాలీవుడ్ వర్గాలకు పెద్దగా తెలియదు. దాంతో ఆయన పక్కన మంచి హీరోయిన్‌ని పెట్టాలని దర్శక నిర్మాతలు భావించారు. జాన్వీకపూర్, కియారా అద్వాని వంటి హీరోయిన్స్‌ను సంప్రదించినా ఫలితం దక్కలేదు.
View this post on Instagram
అయితే ఎట్టకేలకు ఇప్పుడు బాలీవుడ్ ఛత్రపతికి హీరోయిన్ సమస్య తీరిందట. దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫైనల్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే హీరోయిన్‌కు సంబంధించిన యూనిట్ అధికారిక ప్రకటన వెలువడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు దిశా పటాని కెరీర్ తెలుగులో పూరీ జగన్నాథ్, వరుణ్ తేజ్ మూవీ లోఫర్‌తోనే స్టార్ట్ అయ్యింది. తర్వాత ఈ అమ్మడు అన్నీ బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తోంది. ఎట్టకేలకు మరోసారి దిశాపటాని మరో తెలుగు హీరోతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bellamkonda Sreenivas, Bollywood