Mahesh Babu- NTR- Bellamkonda Srinivas: ఈ సంక్రాంతికి అల్లుడు అదుర్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నభా నటేష్, అను ఇమ్మాన్యుల్ హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, సోనూసూద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూలు వినిపిస్తున్నాయి. కాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు గ్రేట్ యాక్టర్ అని, ఎన్టీఆర్ గ్రేట్ ఆర్టిస్ట్ అని తెలిపారు. ఇక ఎన్టీఆర్ ఆర్టిస్ట్ అని ఎందుకు అంటే.. అతడు అన్ని చేయగలడు, గొప్ప యాక్టర్, గొప్ప డ్యాన్సర్, గొప్ప ఫైటర్ అని బెల్లంకొండ కితాబిచ్చారు. ఇక ప్రభాస్ గొప్ప పర్సనాలిటీ ఉన్న వ్యక్తి అని, ఆయనలో ఒక ఔరా ఉంటుందని వివరించారు.
ఇక అల్లు అర్జున్ మల్టీ టాలెంటెడ్ అని తెలిపారు. బన్నీతో మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు తెలుస్తాయని.. సినిమాలపై అతడికి చాలా ఫాషన్ అని బెల్లంకొండ పేర్కొన్నారు. అతడితో మాట్లాడుతుంటే చాలా ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చారు.
కాగా ప్రస్తుతం బెల్లంకొండ ఛత్రపతి రీమేక్ కోసం రెడీ అవుతున్నారు. ఈ రీమేక్‌తో బెల్లంకొండ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఈ రీమేక్‌కి మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం బెల్లంకొండ కూడా కసరత్తులు ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Bellamkonda Sreenivas, Mahesh babu, NTR