Alludu Adhurs: ఇప్పుడు బెల్లంకొండ వంతు.. 'అల్లుడు అదుర్స్‌'కి రిలీజ్ డేట్ ఫిక్స్‌

అల్లుడు అదుర్స్

ఈ నేప‌థ్యంలో మ‌రో యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) కూడా త‌న సినిమాకు రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశాడు.బెల్లంకొండ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన అల్లుడు అదుర్స్(Alludu Adhurs) కూడా సంక్రాంతి బ‌రిలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  • Share this:
    Alludu Adhurs: క‌రోనా ప‌రిస్థితులు స‌ర్దుకోక‌పోయినా.. అన్ని రంగాల ప‌నులు దాదాపుగా మొద‌ల‌య్యాయి. ఇక థియేట‌ర్ల ఓపెనింగ్‌కి అనుమ‌తి రావ‌డంతో.. థియేట‌ర్‌ల‌లో సినిమా హ‌డావిడి మొద‌లైంది. మొన్నటివ‌ర‌కు కొన్ని చిత్రాలు ఓటీటీలో విడుద‌ల కాగా.. ఇప్పుడు మాత్రం మ‌ళ్లీ థియేట‌ర్ల‌లోనే మూవీల‌ను విడుద‌ల చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే మ‌ర్డ‌ర్, సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ చిత్రాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల అయ్యాయి. మ‌రోవైపు థియేట‌ర్ల‌లో విడుద‌లైన చిత్రాల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న కూడా వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో మిగిలిన వారు కూడా రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే యువ హీరో రామ్ త‌న రెడ్ చిత్రానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న రెడ్ మూవీ థియేట‌ర్ల‌లో రాబోతోంది. ఈ నేప‌థ్యంలో మ‌రో యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా త‌న సినిమాకు రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశాడు.

    బెల్లంకొండ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన అల్లుడు అదుర్స్ కూడా సంక్రాంతి బ‌రిలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా జ‌న‌వ‌రి 15న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని బెల్లంకొండ అధికారికంగా ప్ర‌క‌టించారు. థియేట‌ర్లలో మీరు ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండండి అని బెల్లంకొండ కామెంట్ పెట్టారు.



    కాగా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో బెల్లంకొండ స‌ర‌స‌న న‌భా న‌టేష్, అను ఇమ్మాన్యుల్ రొమాన్స్ చేశారు. బాలీవుడ్ న‌టి మౌనీ రాయ్ ఓ స్పెష‌ల్ సాంగ్లో మెర‌వ‌నున్న‌ట్లు స‌మాచారం. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్ ప‌తాకంపై నిర్మితమ‌వుతోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై బెల్లంకొండ మంచి అంచ‌నాలు పెట్టుకున్నాడు.
    Published by:Manjula S
    First published: