Bellamkonda: బాలీవుడ్‌లో బెల్లంకొండ దూకుడు మాములుగా లేదుగా.. ఇప్పటికే ప్రభాస్ ‘ఛత్రపతి’ మూవీని వినాయక్ దర్శకత్వంలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ మరో టాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్‌ను బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. అది కూడా ఎన్టీఆర్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బెల్లంకొండ విషయానికొస్తే.. అల్లుడు శీను’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇపుడు బాలీవుడ్‌లో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ మూవీని హిందీలో వినాయక్ దర్శకత్వంలో బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు.
రాజమౌళి సినిమా ‘ఛత్రపతి’ విషయానికొస్తే.. ఆల్రెడీ సినిమాలో ప్రభాస్ ‘ఛత్రపతి’గా ఎలా డాన్ గా మారాడు అనే కాన్సెప్టే ఈ సినిమా స్టోరీ. ఇప్పటికే తన హిందీ డబ్బింగ్ సినిమాలతో బీటౌన్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈయన హిందీ డబ్బింగ్ సినిమాలకు 100 మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే హిందీ ప్రేక్షకులకు బెల్లంకొండ అంటే ఎవరో తెలుసు. అందుకే సరైన సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ బాలీవుడ్ సినిమా తర్వాత బెల్లంకొండ ప్యాన్ ఇండియా హీరో కావాలనే ఆలోచనలో ఉన్నారు.
ఆల్రెడీ వినాయక్ దర్శకత్వంలో ప్రభాస్ ‘ఛత్రపతి’ సినిమా చేస్తోన్న బెల్లంకొండ ఇపుడు.. ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ ‘ఆది’ సినిమాను హిందీలో పనిలో పనిగా రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూస్ చేసారు. ఈ సినిమా హక్కులు ఆయన దగ్గరే ఉన్నారు. అందుకే ఇపుడు ఈ సినిమాను హిందీలో వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. మొత్తంగా బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కక ముందే బెల్లంకొండ మరో సూపర్ హిట్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకోవడం ఇపుడు టాలీవుడ్ సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bellamkonda Sreenivas, Jr ntr, Prabhas, Tollywood, V.V.Vinayak