హోమ్ /వార్తలు /సినిమా /

Bellamkonda: అభిమాని కోరికను నెరవేర్చిన బెల్లంకొండ శ్రీనివాస్.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్స్..

Bellamkonda: అభిమాని కోరికను నెరవేర్చిన బెల్లంకొండ శ్రీనివాస్.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్స్..

అభిమానిని ఆశ్యర్యపరిచిన బెల్లంకొండ శ్రీనివాస్ (Twitter/Photo)

అభిమానిని ఆశ్యర్యపరిచిన బెల్లంకొండ శ్రీనివాస్ (Twitter/Photo)

Bellamkonda Sreenivas | అభిమాని లేనిదే హీరోలు లేరులే.. ఏ కథానాయకుడుకైనా ఫ్యాన్స్ బలమే కొండంత అండ దండ.తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ ఓ అభిమానికి ఇలానే ఓ ఆశ్యర్యపోయే రీతిలో ఓ సర్ఫ్రైజ్ ఇచ్చాడు.

Bellamkonda Sreenivas | అభిమాని లేనిదే హీరోలు లేరులే.. ఏ కథానాయకుడుకైనా ఫ్యాన్స్ బలమే కొండంత అండ దండ. మన దగ్గర చాలా మంది హీరోలు అభిమానుల అభిప్రాయాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు. కొంత మంది తమ వీరాభిమనులకు ఏదైనా సర్ఫ్రైజ్ గిప్ట్స్ పంపిస్తూ వారిని ఆశ్యర్యపరుస్తుంటారు. మరికొందరు ఫ్యాన్స్ హీరో కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉంటారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ ఓ అభిమానికి ఇలానే ఓ ఆశ్యర్యపోయే రీతిలో ఓ సర్ఫ్రైజ్ ఇచ్చాడు. కర్నూలుకు చెందిన ఓ అభిమాని కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటి గృహ ప్రవేశానికి తన ఫేవరేట్ హీరోను ఆహ్వానించాడు. ఎపుడు సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా అభిమాని కోరికను మన్నించి తన కుటుంబ సభ్యులతో కలిసి సదరు అభిమాని ఇంటి గృహ ప్రవేశానికి వచ్చి వారికి బెస్ట్ విషెస్ అందజేసారు. దీంతో సదరు అభిమాని ఆనందానికి అవధులు లేవు. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల విషయానికొస్తే.. ఈ యేడాది ‘అల్లుడు అదుర్స్’ సినిమాతో పలకరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు.

ప్రస్తుతం హిందీలో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. వి.వి.వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ సెట్‌లో ఈ సినిమా షూటింగ్‌‌ను ప్లాన్ చేసారు. కానీ వర్షాల కారణంగా ఈ సెట్ కూలిపోయింది. దీంతో మరోసారి ఈ సినిమా సెట్స్‌ను నిర్మించే పనిలో పడింది చిత్ర నిర్మాణ సంస్థ. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ భారీ ఎత్తున తెరకెక్కిస్తోంది.

First published:

Tags: Bellamkonda Sreenivas, Bollywood news, Tollywood

ఉత్తమ కథలు