బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం హిందీలో ఓ సినిమాను చేస్తున్నారు. ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమా చత్రపతిని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ ప్రభాస్ చేసిన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తున్నట్లు సమాచారం. అనన్య ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్‌లో నటిస్తోన్నసంగతి తెలిసిందే. అది అలా ఉంటే ఆయన మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. స్టువర్ట్ పురం దొంగ పేరుతో వస్తున్న ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుంది. 1970 ల కాలం నాటి టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించనున్నారు. కెయస్ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలచేసింది చిత్రబృందం.
ఇక ఈ సినిమాతో పాటు బెల్లంకొండ మరో రీమేక్‌లో నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. తమిళ్‌లో ఇటీవల విడుదల ధనుష్ కర్ణన్ తెలుగు రీమేక్‌లో బెల్లంకొండ నటిస్తున్నట్లు టాక్. దీనికి సంబంధించి కర్ణన్ రీమేక్ రైట్స్‌ను బెల్లంకొండ సురేష్ కొన్నట్లు తెలుస్తోంది. కర్ణన్ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకుడు. ఈ సినిమా దళిత బహుజన ఐడియాలజీ నేపథ్యంలో తెరకెక్కింది. తమిళనాడులో జరిగిన ఓ ఘటన ఆధారంగా రూపోందింది. ఇక బెల్లంకొండ చత్రపతి హిందీ రీమేక్ విషయానికి వస్తే.. చత్రపతి హిందీ రీమేక్‌ను పెన్ స్డూడియోస్ నిర్మిస్తోంది. ఛత్రపతి ఒరిజినల్ వెర్షన్‌కి కధను అందించిన ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మరోసారి హిందీకి కథను సమకూరుస్తున్నాడట.
Taking you to the 70s tale of robbery, the Biopic of TIGER ?
Here's TITLE poster@BSaiSreenivas's
?#StuartpuramDonga?
SHOOT BEGINS SOON
?#KS
?#vennelakantiBrothers
?#ManiSharma
?️#ShyamKNaidu
✂️#Thammiraju
?️#ASPrakash
?#BellamkondaSuresh #SreeLakshmiNarsimhaProducrions pic.twitter.com/Qms9bBUfJC
— BARaju's Team (@baraju_SuperHit) August 11, 2021
ఇక బెల్లంకొండ గత సినిమాల విషయానికి వస్తే.. చాలా సంవత్సరాల తర్వాత రాక్షసుడు పేరుతో ఓ మంచి విజయాన్ని అందుకున్నారు బెల్లంకొండ. తమిళ్‌లో ఘన విజయం సాధించిన రాట్సాసన్‌ను తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో రవివర్మ డైరెక్ట్ చేశారు. ఇక ఆయన హీరోగా వచ్చిన మరో సినిమా అల్లుడు అదుర్స్ పోయిన సంక్రాంతికి విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఇవి కూడా చూడండి :
కైవ్ నగర వీధుల్లో ఎన్టీఆర్ రామ్ చరణ్‌లు.. వైరల్ అవుతోన్న వీడియో..
RRR : అర్ధనగ్నంగా పోజులిచ్చిన ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ ఆలియా భట్.. పిక్స్ వైరల్..
Anchor Varshini : బికినీలో యాంకర్ వర్షిణి.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..
Premi Viswanath : బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మెరిసిపోతున్న వంటలక్క...
Anchor Vishnupriya : లోదుస్తుల్లో యాంకర్ విష్ణుప్రియ.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.