• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BELLAMKONDA SREENIVAS LATEST DECISION ON LEAVING HYDERABAD MAKES FANS UPSET SR

Bellamkonda Sreenivas : బెల్లంకొండ షాకింక్ నిర్ణయం.. అభిమానులకు బ్యాడ్ న్యూస్..

Bellamkonda Sreenivas : బెల్లంకొండ షాకింక్ నిర్ణయం.. అభిమానులకు బ్యాడ్ న్యూస్..

బెల్లంకొండ శ్రీనివాస్ Photo : Twitter

Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ ప్రభాస్ చత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా మరోసారి అల్లుడు అదుర్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరవాలేదనిపించింది. అది అలా ఉంటే బెల్లంకొండ ఓ బాలీవుడ్ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి హిందీ రీమేక్ లో బెల్లంకొండ నటించనున్నాడు. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. మాస్ సినిమాలు తీయడంలో వినాయక్ సిద్దహస్తుడు. శ్రీనివాస్ ను ‘అల్లుడు శీను’తో తెలుగులోకి పరిచయం చేసింది కూడా వినాయకే. ఆ చిత్రం మంచి విజయాన్ని కూడా అందించింది. అందుకే వినాయక్ ద్వారానే హిందీలోకి కూడ బెల్లంకొండ లాంఛ్ అవ్వాలని అనుకుంటున్నాడు. అందులో భాగంగా ఈ చత్రపతి రీమేక్‌ను ఆయన చేతిలోని పెట్టారని తెలుస్తోంది. ఇక చత్రపతి సినిమా విషయానికి వస్తే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన యాక్షన్ డ్రామా ఛత్రపతి. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు గానీ, అమ్మ సెంటిమెంట్ గానీ సినిమాలో మంచి కిక్‌ను ఇస్తాయి. చెప్పాలంటే ఈ సినిమా ప్రభాస్ స్థాయిని పెంచిన చిత్రం. ఒకటిన్నర దశాబ్దం క్రితం తెలుగునాట సంచలనం సృష్టించింన ఈ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ కానుంది.

    ఇక ఈ సినిమా కోసం బెల్లంకొండ ముంబైకి మకాం మార్చాడు. ముంబైలోని పోష్ ఏరియా జుహులో ఓ ప్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడట బెల్లంకొండ. తన సినిమా షూటింగ్ పూర్తయే వరకు అక్కడే ఉండనున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫీల్ అవుతున్నారట. అరే తమ అభిమాన హీరో హైదరాబాద్‌ను వదిలిపోవడం ఏంటనీ.. బెల్లంకొండ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నారట. ఇక కొన్ని రోజుల వరకు అందుబాటులో ఉండడని తెలుసుకున్న ఫ్యాన్స్ బాధపడుతున్నారట. ఇక ఈ సినిమాను పెన్ మూవీస్ బ్యానర్‌పై జయంతిలాల్ గడ నిర్మిస్తున్నాడు.



    ఛత్రపతి ఒరిజినల్ వెర్షన్‌కి కధను అందించిన ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మరోసారి హిందీకి కథను సమకూరుస్తున్నారు. హిందీ వెర్షన్‌కి అనుకూలంగా ఉండటం కోసం సెకండాఫ్‌లో ఛత్రపతి హిందీ రీమేక్ కథను కొంత మారుస్తున్నారని టాక్. మరి ఈ సినిమాలో బెల్లంకొండ ఎలా చేస్తాడో చూడాలి మరి. ఈ రీమేక్‌లో హీరోయిన్ గా జాన్వీకపూర్‌ను లేదా అనన్యపాండేను చిత్రబృందం పరిశీలిస్తోందని టాక్.

    ఇక బెల్లంకొండ గత సినిమాల విషయానికి వస్తే.. చాలా సంవత్సరాల తర్వాత రాక్షసుడు పేరుతో ఓ మంచి విజయాన్ని అందుకున్నాడు. తమిళ్‌లో ఘన విజయం సాధించిన రాట్సాసన్‌ను తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో రవివర్మ డైరెక్ట్ చేశాడు. సినిమాలో కథ కథానాలతో పాటు ఒరిజినాలిటీని ఎక్కడా పాడుచెయ్యకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీసిన ఈ చిత్రం తెలుగులో కూడా విమర్శకుల ప్రశంసల్నీ పొందింది. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా చేసిన బెల్లంకొండకు తన కెరీర్‌లోని బిగ్గేస్ట్ హిట్‌గా ఆ సినిమా నిలిచింది.
    Published by:Suresh Rachamalla
    First published: