news18-telugu
Updated: April 30, 2019, 3:27 PM IST
బెల్లంకొండ శ్రీనివాస్ కవచం మూవీ
గతేడాది చివర్లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్, మెహరీన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కవచం’. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో డిజాస్టర్‌గా నిలిచింది. ఐతే.. ఇక్కడ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాను హిందీలో ‘ఇన్‌స్పెక్టర్ విజయ్’ పేరుతో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. యూట్యూబ్‌లో ఈ సినిమాను అప్‌లోడ్ చేసిన 24 గంటల్లో ఈ సినిమాకు కోటి 60 లక్షల మంది ఈసినిమాను వీక్షించారు. గత యేడాది డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. కొంత మంది తెలుగు ఆడియన్స్ కవచం హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు ఈ రేంజ్‌లో వ్యూస్ చూసి నిజమా కాదా మన తెలుగు ప్రేక్షకులు గిల్లుకొని మరి అవాక్కువుతున్నారు.

బెల్లంకొండ కవచం మూవీ
గత కొన్నేళ్లుగా తెలుగులో విడుదలవుతున్న ప్రతి సినిమా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూసిన డబ్బింగ్ సినిమాగా రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత ‘అజ్ఞాతవాసి’,‘లై’, దువ్వాడ జగన్నాథం’ వంటి సినిమాలు కూడా హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే కదా.
First published:
April 30, 2019, 3:16 PM IST