హోమ్ /వార్తలు /సినిమా /

Bellamkonda Sreenivas : యూట్యూబ్‌లో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..

Bellamkonda Sreenivas : యూట్యూబ్‌లో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..

Jaya Janaki Nayaka Photo : Twitter

Jaya Janaki Nayaka Photo : Twitter

Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas)నటించిన జయ జానకి నాయక (Jaya Janaki Nayaka) ఖూంకర్ మూవీ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన డబ్ చేసిన భారతీయ చిత్రంగా జయ జానకి నాయక ఖూంకర్ చిత్రం నిలిచింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas)నటించిన జయ జానకి నాయక (Jaya Janaki Nayaka) ఖూంకర్ మూవీ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన డబ్ చేసిన భారతీయ చిత్రంగా జయ జానకి నాయక ఖూంకర్ చిత్రం నిలిచింది. బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet) ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు చిత్రం జయ జానకి నాయక ఖూంకర్ హిందీలోకి డబ్ చేశారు. పెన్ మూవీస్ (Pen Movies) ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో ఫిబ్రవరి 2018లో అప్ లోడ్ చేసింది. హిందీలోకి డబ్ అయిన దక్షిణాది సినిమాలకు హిందీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అల్లు అర్జున్ సినిమాలు తొలినాళ్లలో యూట్యూబ్‌లో హిందీలో అత్యధికంగా వ్యూస్ వచ్చేది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలను హిందీ ప్రేక్షకులు ఆదరించారు.

బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జయ జానకి నాయక. చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ మసాలా యాక్షన్‌ హిందీ డబ్బింగ్ మూవీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. భారీ సంఖ్యలో సినిమాను వీక్షించారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ నటన అందరికీ నచ్చింది. ఇప్పటికే హిందీ ప్రేక్షకుల ఆదరణ పొందిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. లాక్‌డౌన్ సమయంలో యూట్యూబ్‌లో జయ జానకి నాయక చిత్రాన్ని కోట్లాది మంది వీక్షించారు. 709 మిలియన్ల వ్యూస్‌తో జయ జానకి నాయక ఈ రికార్డు నెలకొల్పింది.

హిందీలో జయ జానకి నాయక చిత్రానికి వచ్చిన స్పందనతో ఆ చిత్ర నటుడు బెల్లకొండ శ్రీనివాస్ హిందీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. చత్రపతి సినిమాను వివి వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేయాలని నిర్ణియంచుకున్నారు. ఈ చిత్రం 2023 మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా హిందీలో ఓ సినిమా చేయనున్నాడు. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన చిత్రం 2023 అక్టోబర్ లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బెల్లంకొండ శ్రీనివాస్, బోయపాటి శ్రీను ఇద్దరికీ జయ జానకి నాయక గేట్లు తెరిచినట్లు అయింది. తెలుగు చిత్రసీమ నుంచి ఎందరో దర్శకులు బాలావుడ్ లో సక్సెస్ అయ్యారు. అనేక మంది తెలుగు చిత్ర దర్శకులు వందలాది హిందీ సినిమాలు చేశారు. బోయపాటి యాక్షన్ సన్నివేశాలు కూడా హిందీ ప్రేక్షకులను కట్టిపడేసే అవకాశం లేకపోలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ కు తెలుగులో పెద్దగా బ్రేక్ రాలేదు. హిందీ పరిశ్రమలో అయినా ఆయన రానిస్తారేమో వేచి చూడాలి.

First published:

Tags: Bellamkonda Sreenivas, Rakul Preet Singh, Tollywood news

ఉత్తమ కథలు