BellamKonda Sreenivas : ఛత్రపతి హిందీ రీమేక్ కోసం రాజమౌళి... లాంఛనంగా ప్రారంభం..

Rajamouli Photo : Twitter

BellamKonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు.

  • Share this:
    అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడో రాగా.. ఈరోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమానికి రాజమౌళి గెస్ట్‌గా రానున్నారట. దీనికి సంబంధించిన ఓ ప్రకటనను చిత్రబృందం ప్రకటించింది. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 8:30కి జరుగనుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరి హీరోయిన్స్‌కు ఛాన్స్ ఉందట. దీంతో ఇప్పటికే పలువురు హీరోయిన్లను సంప్రదించిన ప్రయోజనం లేకపోయినట్లుగా సమాచారం. తాజాగా ఈ సినిమాలో నటించేందుకు అనన్య పాండేను ఎంపిక చేయాలని భావిస్తోందట చిత్రబృందం. అనన్య ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్‌లో నటిస్తోన్నసంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది.

    ఇక బెల్లంకొండ సినిమా విషయానికి వస్తే.. చత్రపతి హిందీ రీమేక్‌ను పెన్ స్డూడియోస్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం బెల్లంకొండ ముంబైకి మకాం మార్చాడు. ముంబైలోని పోష్ ఏరియా జుహులో ఓ ప్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడట బెల్లంకొండ. తన సినిమా షూటింగ్ పూర్తయే వరకు అక్కడే ఉండనున్నారట. ఇక ఛత్రపతి ఒరిజినల్ వెర్షన్‌కి కధను అందించిన ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మరోసారి హిందీకి కథను సమకూరుస్తున్నారు. హిందీ వెర్షన్‌కి అనుకూలంగా ఉండటం కోసం సెకండాఫ్‌లో ఛత్రపతి హిందీ రీమేక్ కథను కొంత మారుస్తున్నారని టాక్. బెల్లంకొండ తమిళ్’ లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న కర్ణన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇక బెల్లంకొండ గత సినిమాల విషయానికి వస్తే.. చాలా సంవత్సరాల తర్వాత రాక్షసుడు పేరుతో ఓ మంచి విజయాన్ని అందుకున్నాడు. తమిళ్‌లో ఘన విజయం సాధించిన రాట్సాసన్‌ను తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో రవివర్మ డైరెక్ట్ చేశాడు. సినిమాలో కథ కథానాలతో పాటు ఒరిజినాలిటీని ఎక్కడా పాడుచెయ్యకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీసిన ఈ చిత్రం తెలుగులో కూడా విమర్శకుల ప్రశంసల్నీ పొందింది. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా చేసిన బెల్లంకొండకు తన కెరీర్‌లోని బిగ్గేస్ట్ హిట్‌గా ఆ సినిమా నిలిచింది. ఇక ఆయన తాజా సినిమా అల్లుడు అదుర్స్ సంక్రాంతి కానుకగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
    Published by:Suresh Rachamalla
    First published: