Rakshasudu Trailer Talk: థ్రిల్ చేస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ ట్రైలర్..

‘జయ జానకి నాయక’ తర్వాత సరైన సక్సెస్ లేని బెల్లంకొండ శ్రీనివాస్..గత యేడాది చేసిన ‘కవచం’తో పాటు రీసెంట్‌గా తెరకెక్కిన ‘సీత’ తో ఆడియన్స్‌ను మెప్పించ లేకపోయాడు. తాజగా ఈ కథానాయకుడు తమిళంలో హిట్టైన ‘రాచ్చసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’తో పేరుతో రీమేక్ చేసాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసాడు.

news18-telugu
Updated: July 18, 2019, 4:59 PM IST
Rakshasudu Trailer Talk: థ్రిల్ చేస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ ట్రైలర్..
రాక్షసుడులో బెల్లంకొండ,అనుపమ పరమేశ్వరన్
  • Share this:
‘జయ జానకి నాయక’ తర్వాత సరైన సక్సెస్ లేని బెల్లంకొండ శ్రీనివాస్..గత యేడాది చేసిన ‘కవచం’తో పాటు రీసెంట్‌గా తెరకెక్కిన ‘సీత’ తో ఆడియన్స్‌ను మెప్పించ లేకపోయాడు. తాజగా ఈ కథానాయకుడు తమిళంలో హిట్టైన ‘రాచ్చసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’తో పేరుతో రీమేక్ చేసాడు. రమేష్ వర్మ డైెరెక్ట్ చేసిన ఈ సినిమాలో బెల్లంకొండ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ మొత్తం సస్సెన్స్ థ్రిల్లర్‌గా ఆకట్టుకునేలా ఉంది. అమ్మాయిలను చంపే సైకో.. అతని పట్టుకోవడానికి ఒక పోలీస్ టీమ్.. ఇంతకీ ఈ సైకో ఎందుకు అమ్మాయిలను చంపుతాడు. అతన్ని పట్టుకోవడానిని పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఏం చేసాడనేదే ‘రాక్షసుడు’ స్టోరీ. ‘కవచం’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. మరి ఈ రాక్షసుడు’ సినిమాతోనైనా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సక్సెస్ అందుకుంటాడా  లేదా అనేది చూాడాలి.


First published: July 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...