Rakshasudu Teaser Talk: ఆకట్టుకునే బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ టీజర్..

‘జయ జానకి నాయక’ తర్వాత సరైన సక్సెస్ లేని బెల్లంకొండ శ్రీనివాస్..గత యేడాది చేసిన ‘కవచం’తో పాటు రీసెంట్‌గా తెరకెక్కిన ‘సీత’ తో ఆడియన్స్‌ను మెప్పించ లేకపోయాడు. తాజగా ఈ కథానాయకుడు తమిళంలో హిట్టైన ‘రాచ్చసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’తో పేరుతో రీమేక్ చేసాడు. తాాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసారు.

news18-telugu
Updated: June 1, 2019, 11:52 AM IST
Rakshasudu Teaser Talk: ఆకట్టుకునే బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ టీజర్..
బెల్లంకొండ శ్రీనివాస్ ఐదేళ్ల నిరీక్షణ తర్వాత రాక్షుడు సినిమాతో విజయం మొహం చూసేలా కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి టాక్ అద్భుతంగా వచ్చింది. తొలిరోజే 2.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్.
  • Share this:
‘జయ జానకి నాయక’ తర్వాత సరైన సక్సెస్ లేని బెల్లంకొండ శ్రీనివాస్..గత యేడాది చేసిన ‘కవచం’తో పాటు రీసెంట్‌గా తెరకెక్కిన ‘సీత’ తో ఆడియన్స్‌ను మెప్పించ లేకపోయాడు. తాజగా ఈ కథానాయకుడు తమిళంలో హిట్టైన ‘రాచ్చసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’తో పేరుతో రీమేక్ చేసాడు. రమేష్ వర్మ డైెరెక్ట్ చేసిన ఈ సినిమాలో బెల్లంకొండ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసారు. ఈ టీజర్ చూస్తుంటే.. అమ్మాయిలను చంపే సైకో.. అతని పట్టుకోవడానికి ఒక పోలీస్ టీమ్.. ఇంతకీ ఈ సైకో ఎందుకు అమ్మాయిలను చంపుతాడు. అతన్ని పట్టుకోవడానిని పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఏం చేసాడనేదే ‘రాక్షసుడు’ స్టోరీ. తాజాగా విడులైన ఈ మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ ‌గా ఉంది. ‘కవచం’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. మరి ఈ రాక్షసుడు’ సినిమాతోనైనా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సక్సెస్ ఎక్కుతాడా లేదా అనేది చూాడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 1, 2019, 11:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading