బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) హిందీలో ప్రభాస్ సూపర్ హిట్ సినిమా ఛత్రపతి(Chatrapathi)ని రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ (Pen Movies) ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడు (VV Vinayak). శ్రీనివాస్ ను ‘అల్లుడు శీను’తో తెలుగులోకి పరిచయం చేసింది కూడా వినాయకే. ఇక ఈ సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా టీజర్’ను విడుదల చేసింది టీమ్. టీజర్ అదిరందనే చెప్పాలి. భారీ యాక్షన్, మాస్ హంగులతో ఛత్రపతి టీజర్ బాగుంది. టీజర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్‌తో పాటు యాక్షన్‌కు నెటిజన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇక ఛత్రపతి ఒరిజినల్ విషయానికి వస్తే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన యాక్షన్ డ్రామా ఛత్రపతి. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు గానీ, అమ్మ సెంటిమెంట్ గానీ సినిమాలో మంచి కిక్‌ను ఇస్తాయి. చెప్పాలంటే ఈ సినిమా ప్రభాస్ స్థాయిని పెంచిన చిత్రం. ఒకటిన్నర దశాబ్దం క్రితం తెలుగునాట సంచలనం సృష్టించింన ఈ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్‌గా వస్తోంది. అంతేకాదు ఈ సినిమా తెలుగులోను విడుదలకానుంది.
Lights. Camera. TOO MUCH ACTION! Literally ????#ChatrapathiTeaser out now: https://t.co/rl6WH6j9dZ
Written by #VijayendraPrasad, directed by #VVVinayak.#Chatrapathi in cinemas on 12th May, 2023.@BSaiSreenivas @Nushrratt @bhagyashree123 @SharadK7 @Penmovies #JayantilalGada pic.twitter.com/eCmfVJ0qQw — PEN INDIA LTD. (@PenMovies) March 30, 2023
ఛత్రపతి ఒరిజినల్ వెర్షన్‌కి కధను అందించిన ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మరోసారి హిందీకి కథను సమకూరుస్తున్నారు. హిందీ వెర్షన్‌కి అనుకూలంగా ఉండటం కోసం సెకండాఫ్‌లో ఛత్రపతి హిందీ రీమేక్ కథను కొంత మారుస్తున్నారని టాక్. మరి ఈ సినిమాలో బెల్లంకొండ ఎలా చేస్తాడో చూడాలి మరి.
Excited and grateful to announce my next with @14ReelsPlus & @saagar_chandrak!#BSS10 loading..????@RaamAchanta #GopiAchanta pic.twitter.com/U2FC7ZxiTZ
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) March 30, 2023
ఇక బెల్లంకొండ ఛత్రపతి పాటుమరో సినిమాను కూడా చేస్తున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైరెక్టర్ సాగర్ కె చంద్రతో ఓ సినిమాను చేస్తున్నట్లు ప్రకటించాడు. సాగర్ చంద్ర ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో వచ్చిన భీమ్లా నాయక్‌లో డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ 10వ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ ప్రాజెక్ట్‌ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.
ఇక బెల్లంకొండ చాలా సంవత్సరాల తర్వాత ఆ మధ్య రాక్షసుడు పేరుతో ఓ మంచి విజయాన్ని అందుకున్నాడు. తమిళ్‌లో ఘన విజయం సాధించిన రాట్సాసన్‌ను తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో రవివర్మ డైరెక్ట్ చేశాడు. సినిమాలో కథ కథానాలతో పాటు ఒరిజినాలిటీని ఎక్కడా పాడుచెయ్యకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీసిన ఈ చిత్రం తెలుగులో కూడా విమర్శకుల ప్రశంసల్నీ పొందింది. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా చేసిన బెల్లంకొండకు తన కెరీర్‌లోని బిగ్గేస్ట్ హిట్‌గా ఆ సినిమా నిలిచింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు జంటగా అనుపమ పరమేశ్వరన్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.