Bellamkonda: ’అల్లుడు అదుర్స్’ షూటింగ్ స్టార్ట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..

Bellamkonda Sai Sreenivas Alludu Adhurs Shooting Starts | కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా షూటింగ్స్ లేవు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఒక్కో హీరో షూటింగ్‌లో జాయిన్ అవుతున్నారు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు.

news18-telugu
Updated: September 21, 2020, 12:34 PM IST
Bellamkonda: ’అల్లుడు అదుర్స్’ షూటింగ్ స్టార్ట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..
‘అల్లుడు అదుర్స్’ షూటింగ్ స్టార్ట్ చేసిన బెల్లంకొండ (Twitter/Photo)
  • Share this:
కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా షూటింగ్స్ లేవు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఒక్కో హీరో షూటింగ్‌లో జాయిన్ అవుతున్నారు. కరోనా సూచనల మేరకు ఎంతో జాగ్రత్తగా షూటింగ్స్ మొదలు పెడుతున్నారు. ఇప్పటికే నాగార్జున.. బిగ్‌బాస్ షోతో పాటు ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు. ఈ రోజే షూటింగ్‌లో జాయిన్ అయినట్టు ప్రకటించాడు. గతేడాది రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘రాక్షసుడు’ కూడా బెల్లంకొండ శ్రీనివాస్‌కు మంచి పేరే తీసుకొచ్చింది. తాజాగా ఈ హీరో ఎన్టీఆర్‌తో రభస వంటి ఫ్లాప్ సినిమా తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్దుడు అదుర్స్’ సినిమా స్టార్ట్ చేసాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.


ఇపుడు ఈ రోజు ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించినట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 21, 2020, 12:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading