Bellamkonda As Stuartpuram Donga : ‘స్టూవర్ట్‌పురం దొంగ’గా బెల్లంకొండ.. నాగేశ్వరరావు బయోపిక్‌లో శ్రీనివాస్.. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఈ కోవలోనే తెలుగులో ఇపుడు రవితేజ .. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ మూవీకి పోటీగా బెల్లంకొండ శ్రీనివాస్.. స్టూవర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్రపై ఓ ‘స్టూవర్ట్‌పురం దొంగ’ టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బయోపిక్‌లపై ఎవరికీ ఎలాంటి హక్కులు ఉండవు కాబట్టి.. ఎవరైనా ఈ సినిమాను తెరకెక్కించవచ్చు. ఈ కోవలో KS దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్టూవర్ట్‌పురం దొంగ’ టైటిల్‌తో ఈ సినిమా చేస్తున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ విషయానికొస్తే.. రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ. తాను దోచుకున్న దాంట్లో పేదలకు సాయం చేస్తుండేవారు. అందుకే ఆయనకు ప్రజల్లో ఎంతో పేరుండేది. ఈయన్ని బ్రిటిష్ వారు పట్టుకొని ఉరి తీశారు.
1970 ల కాలం నాటి టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించనున్నారు. కెయస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను దీపావళి కానుకగా విడుదల చేసారు. ఈ పోస్టర్లో పెరిగిన గడ్డంతో రఫ్ లుక్‌లో బెల్లంకొండ లుక్ టెర్రిఫిక్‌గా ఉంది.
ఇక ఈ సినిమాతో పాటు బెల్లంకొండ మరో రీమేక్‌లో నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. తమిళ్లో ఇటీవల విడుదల ధనుష్ కర్ణన్ తెలుగు రీమేక్‌లో బెల్లంకొండ నటిస్తున్నట్లు టాక్. దీనికి సంబంధించి కర్ణన్ రీమేక్ రైట్స్‌ను బెల్లంకొండ సురేష్ కొన్నట్లు తెలుస్తోంది. కర్ణన్ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకుడు. ఈ సినిమా దళిత బహుజన ఐడియాలజీ నేపథ్యంలో తెరకెక్కింది. తమిళనాడులో జరిగిన ఓ ఘటన ఆధారంగా రూపోందింది. ఇక బెల్లంకొండ చత్రపతి హిందీ రీమేక్ విషయానికి వస్తే.. చత్రపతి హిందీ రీమేక్‌ను పెన్ స్డూడియోస్ నిర్మిస్తోంది. ఛత్రపతి ఒరిజినల్ వెర్షన్‌కి కథను కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కిస్తున్నారు.
HBD Mehreen Kaur : హ్యాపీ బర్త్ డే మెహ్రీన్ కౌర్.. F3 భామకు ఇది ఎన్నో పుట్టినరోజు తెలుసా..
ఒకేసారి రవితేజతో పాటు బెల్లంకొండ ఒకే తరహా స్టోరీని చేయడం ఇపుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్టీఆర్ హీరోగా మూడు పాత్రల్లో ‘దాన వీర శూర కర్ణ’ సినిమా తెరకెక్కిస్తే.. దానికి పోటీగా పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కలిసి ‘కురుక్షేత్రం’ సినిమాను చేశారు. ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో 1977లో సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. వీటిలో అన్నగారి ‘దాన వీర శూర కర్ణ’ సినిమా ముందు కృష్ణ భారీ మల్టీస్టారర్ ‘కురుక్షేత్రం’ తేలిపోయింది.
Pooja Hegde : లెహంగాలో అదిరిన పూజా హెగ్డే అందాలు.. వైరల్ అవుతున్న పిక్స్..
ఆ తర్వాత హిందీలో ‘భగత్ సింగ్’ జీవిత కథతో అజయ్ దేవ్‌గణ్, సన్ని దేవోల్, బాబీ దేవోల్ ల సినిమాతో పాటు సోనూసూద్ ప్రధాన పాత్రలో నటించిన భగత్ సింగ్ బయోపిక్‌లు ఒకేసారి విడుదలయ్యాయి. అందులో అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘లెజండ్ ఆఫ్ భగత్ సింగ్’ సినిమా సూపర్ హిట్టైయింది. అంతేకాదు ఈ చిత్రంలో నటనకు అజయ్ దేవ్‌గణ్ జాతీయ ఉత్తమ నటుడిగా రెండోసారి అవార్డు అందుకున్నారు. మరి ఇదే తరహాలో ఇపుడు తెలుగులో ఒకే కథతో రవితేజ.. ‘టైగర్ నాగేశ్వరరావు’గా .. బెల్లంకొండ .. ’స్టూవర్ట్‌పురం దొంగ’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వీళ్లిద్దరిలో ఎవరు బాక్సాఫీస్ విజేతగా నిలుస్తారనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bellamkonda Sreenivas, Ravi Teja, Telugu Cinema, Tiger Nageswara Rao, Tollywood