Chiranjeevi: చిరంజీవి నిజంగా గుండు చేసుకున్నాడా.. అసలు నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Megastar Chiranjeevi Urban Monk | మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా అర్భన్ మాంక్ అదేనండి బోడి గుండుతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ లుక్ వెనక ఉన్న అసలు రహస్యాన్ని చిరంజీవి బయటపెట్టారు.

news18-telugu
Updated: September 15, 2020, 11:13 AM IST
Chiranjeevi: చిరంజీవి నిజంగా గుండు చేసుకున్నాడా.. అసలు నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
గుండుతో చిరంజీవి (Instagram/Chiranjeevi)
  • Share this:
Megastar Chiranjeevi Urban Monk | మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా అర్భన్ మాంక్ అదేనండి బోడి గుండుతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అయితే.. చిరంజీవి ఈ గుండు చేయించుకున్నాడా అని అభిమానులు రకరకాలుగా చర్చించుకున్నారు. ఆయన ఫోటో పోస్ట్ చేసిన క్షణం నుంచి ఇప్పటి వరకు దుమ్ము దులిపేస్తుంది అది. కోట్లాది మంది ఆ ఫోటోను చూసి మెగా లుక్ అదిరిపోయింది బాసూ అంటున్నారు. అసలు చిరు ఆ గుండులో భలే ఉన్నాడు కూడా. లాక్‌డౌన్ సమయంలో తనను తాను పరీక్షించుకుంటున్నాడు చిరంజీవి. ఒక్కోసారి ఒక్కో లుక్‌లో కనిపిస్తున్నాడు. ఆ మధ్య బ్లఫ్ మాస్టర్ దర్శకుడు గోపీ గణేష్‌ను కలిసినపుడు మీసాలు లేకుండా కనిపించి ఆశ్యర్యపరిచాడు. తాజాగా ఈ గుండు వెనక ఉన్న అసలు సీక్రెట్‌ను చిరంజీవి బయటపెట్టారు.








View this post on Instagram





Thanks to all the technicians of the industry, who can make any look believable. Salute the magic of cinema!


A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on





ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో హిట్టైన ‘వేదాలం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. కోలీవుడ్‌లో అజిత్ హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని శివ తెరకెక్కించాడు. అక్కడ సూపర్ హిట్ అయింది వేదాళం. అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా నీసన్ దర్శకత్వంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు నిర్మాత ఏఎం రత్నం. ఈ మేరకు పూజా కార్యక్రమాలు కూడా చేసారు కానీ కుదర్లేదు. అయితే ఇప్పుడు ఇదే సినిమాను చిరంజీవి రీమేక్ చేస్తున్నాడు.

చిరంజీవి అజిత్ (chiranjeevi ajith)
చిరంజీవి అజిత్ (chiranjeevi ajith)


ఈ సినిమా ఒరిజినల్ వర్షన్‌లో అజిత్ గుండుతోనే ఉంటాడు. చిన్న వెంట్రుకలతో ఆ హెయిర్ స్టైల్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్ కోసం ఇప్పుడు చిరంజీవి కూడా గుండుతో  కనిపిస్తే ఎలా ఉంటుదనే విషయాన్ని చెక్ చేసుకోవడానికి గుండుతో టెస్ట్ లుక్ చేయించుకున్నాడు. మేకప్ నిపుణుల ఇది నిజమైన గుండు అనేలా చిరంజీవిని గుండు లుక్‌లో మేకప్ చేసారు. చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇది మేకప్ టెస్ట్ అని చెప్పేంత వరకు అందరు చిరంజీవిది నిజం గుండే అనుకున్నారు. మొత్తానికి మేకప్ నిపుణులు చిరుకు చేసిన ఈ మేకప్ ఇపుడు మరోసారి చర్చనీయాంశం అయింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 15, 2020, 11:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading